న్యూజిలాండ్ కు కొత్త జాతీయ జెండా

New Flag Of Newzeland

05:26 PM ON 15th December, 2015 By Mirchi Vilas

New Flag Of Newzeland

న్యూజిలాండ్ కు కొత్త జాతీయ జెండా రానుంది. బ్రిటిష్ వలస దేశమనే ముద్రను చెరిపేసుకుంటూ న్యూజిలాండ్ ప్రజలు కొత్త జాతీయ జెండాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నూతన జాతీయ జెండా డిజైన్ ఎంపిక కోసం జరిగిన ప్రత్యేక పోలింగ్ ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. నీలం, నలుపు రంగు బ్యాక్ గ్రౌండ్ పై సిల్వర్ చెట్టు ఆకు(న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ ధరించే లోగో), పక్కనే ఎరుపు రంగులో నాలుగు నక్షత్రాలు ఉన్న డిజైన్.. పోస్టల్ బ్యాలెట్ లో అత్యధిక ఓట్లు సాధించింది. దీంతో ఈ కొత్త డిజైన్.. పాత జెండాతో పోటీపడేందుకు అర్హత సాధించినట్లయింది. జాతీయ జెండా మార్పునకు సంబంధించిన అసలు ఎన్నిక వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది. కొత్త జెండా కోసం న్యూజిలాండ్ పౌరులు దాదాపు 10వేల డిజైన్లు పంపడం గమనార్హం.

English summary

New Zealand country has confirmed the new national flag of newzeland country.The flag is with black, white and blue silver fern