స్కల్ క్యాండీ కొత్త హెడ్ ఫోన్

New Head Phones From Skull Candy

04:44 PM ON 9th December, 2015 By Mirchi Vilas

New Head Phones From Skull Candy

సౌండ్ లవర్స్ కోసం స్కల్ క్యాండీ మరో కొత్త హెడ్ ఫోన్ ను మార్కెట్ లోకి తెచ్చింది. స్కల్ క్యాండీ అప్ రోర్ బీటీ పేరుతో లాంచ్ చేసిన ఈ కొత్త హెడ్ ఫోన్ ధర రూ. 5,999. తన అధికారిక డిస్ట్రిబ్యూటర్ అయిన బ్రాండ్ ఐస్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా వీటిని భారత్ లోకి రిలీజ్ చేసింది స్కల్ క్యాండీ. ఇప్పటికే ప్రముఖ వెబై సైట్లలో రూ. 2000 కే లభ్యమవుతున్న వైర్డ్ హెడ్ ఫోన్స్ కు అప్ డేట్ వెర్షన్ ఈ వైర్ లెస్ వెర్షన్. హెడ్ ఫోన్స్ నిత్యావసరాల్లో భాగం అయిపోయిందని, ముఖ్యంగా యూత్ ను టార్గెట్ గా పెట్టుకుని ఈ హెడ్ ఫోన్స్ తీసుకొచ్చినట్టు బ్రాండ్ ఐస్ డిస్ట్రిబ్యూటర్స్ వ్యవస్థాపకుడు, సీఈవో అమ్లన్ భట్టాచార్య తెలిపారు. లైట్ వెయిట్ బరువుతో ఉండే ఈ హెడ్ ఫోన్స్ లో బ్లూ టూత్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇందులో ఉండే బ్యాటరీ పది గంటలు పనిచేస్తుంది. బిల్ట్ ఇన్ మైక్రో ఫోన్ కూడా ఉంది. కూడి వైపు ఇయర్ కప్ కింద ఉండే బటన్ తో కంట్రోల్ చేసే సదుపాయం కూడా ఉంది. దీని వల్ల స్మార్ట్ ఫోన్ ను జేబు లోంచి తీయాల్సిన పనిలేదు.

English summary

Skullcandy has launched the Uproar BT headphones in India.The price of these headphones starts at at Rs. 5,999