డాక్టర్ యాప్

New Health app releases

05:28 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

New Health app releases

డాక్టర్ మందుల చీటీలో మందులు రాసినప్పుడు అవి ఎందుకు, ఏమిటి అనే సమాచారం రోగికి సాధారణంగా ఇవ్వరు. ఒక్కోసారి కొన్ని మందుల వలన సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటాయి. మనం వాడుతున్న మందులు,దుకాణంలో కొంటున్న మందుల గురించి సమాచారం తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ ఉంటుంది. పైగా చాలా ఉపయోగం కూడా. మందు రకరకాల కంపెనీలు తయారు చేస్తాయి. కొన్ని కంపెనీలు చాలా తక్కువ ధరకు వాటిని ఇస్తుండవచ్చు. ఆ సమాచారం కనిపిస్తుంది. మందు దేనికోసం ఎలా పనిచేస్తుందో సమాచారం ఇస్తుంది. టానిక్ పేరు టైప్ చేస్తే దానికి సంబంధించిన సమాచారం మొత్తం కనిపిస్తుంది. గర్భిణీలు,పాలు తాగే తల్లుల మీద,ఒకవేళ మీరు ఆల్కహాల్ తీసుకునేవారయితే అది మీ శరీరం మీద ఆ మందు ప్రభావం చూపిస్తుందో తెలుపుతుంది.

ఈ మందుల మీద క్లిక్ చేసి మందులు ఆర్డర్ చేసుకోవచ్చు. వాటి మీద 15 శాతం రాయితీ కూడా పొందవచ్చు. అయితే ఈ సౌకర్యం ప్రస్తుతం ఢిల్లీ,బెంగుళూరులలో మా త్రమే ఉంది. ‘మై ఆరెక్స్’ అనే ఫీచర్ ఉంది ఈ యాప్‌లో. అందులో మందుల చీటీని ఉంచుకోవచ్చు. ప్రిస్క్రిప్షన్ పోగొట్టుకునే అవకాశం ఉండదు. ఈ యాప్ ఆరోగ్య మరియు మహిళా సంక్షేమ మంత్రిత్వశాఖ ద్వారా గుర్తింపు పొందింది. మన దేశంలో వైద్య వర్గంలో అత్యుత్తమ యాప్‌గా ర్యాంకింగ్ పొందింది. ఎన్నో అవార్డులు కూడా పొందిన యాప్ ఇది. కాబట్టి ఇది వాడటం ఉపయోగకరం.

English summary

My Rx health app used for healthcare,to know clinical drug information,about the medicines.We can buy medicines through online in this app and we can get upto 15 % discount