కంటి చూపుతో ఫోన్ అన్ లాక్..!

New Iris Scanner phone can unlock with your eyes

05:20 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

New Iris Scanner phone can unlock with your eyes

మరోసరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫోన్లకు దీటుగా ఐరిస్ స్కానర్ తో ఈ కొత్త ఫోన్ పనిచేయనుంది. ఈ ఐరిస్ స్కానర్ తోనే ఫోన్ అన్ లాక్ అవుతుంది. అంటే ఫోన్‌ ఫ్రంట్‌ కెమెరా రెటీనాను స్కాన్‌ చేసిన తర్వాత అన్‌లాక్‌ అవుతుందన్న మాట. విలువైన సమాచారాన్ని, చిత్రాలను కాపాడుకోవడానికి ఈ ఐరిస్ స్కానర్ ఎంతో ఉపయోగపడనుంది. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ టీసీఎల్ ఈ ఐరిస్ స్కానర్ ఫోన్ ను తీసుకొచ్చింది. టీసీఎల్ ప్రైడ్ టీ500ఎల్ అనే ఈ ఫోన్ 4జీతో పాటు సీడీఎంఏ సిమ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ ఫోన్ సింగిల్ సిమ్ తోనే పనిచేస్తుంది. ప్రస్తుతం స్నాప్ డీల్ లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ధర రూ.10,499.

ఇందులో ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080X1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 3050 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండటం ఈ ఫోన్ స్పెషాలిటీ. సీడీఎంఏ వినియోగదారులకు ఈ ఫోన్ మంచి ఆప్షన్. అయితే సింగిల్ సిమ్ కావడం దీనికి పెద్ద మైనస్.

English summary

At present the smart phones with finger print sensors are trending in mobile market. Customers were also willing to buy Smart phones with finger print sensor. Due to that requirement soo many companies were launching their smart phones with a finger prinrt sensor. Now china mobile company tcl launches its new smart phone called tcl pride t500 4g with iris scanner. With the use of this iris scanner we can unlock our phone with the use of our eyes directly