కొత్త జేమ్స్ బాండ్ ఇతనే!

New James Bond for James Bond movie

01:23 PM ON 26th May, 2016 By Mirchi Vilas

New James Bond for James Bond movie

చావనైనా చస్తాను కానీ జేమ్స్ బాండ్ చిత్రాల్లో మాత్రం నటించనని డేనియల్ క్రెయిగ్ చెప్పిన మాటలు కోపం తెప్పించాయో ఏంటో కానీ.. జేమ్స్ బాండ్ ఫ్రాంచైజ్ ఓనర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారనే వార్త హల్ చల్ చేస్తుంది. ఈసారి మాత్రం యంగ్ బాండ్ ని రంగంలోకి దింపాలనుకుంటున్నారట. ఎందుకంటే డేనియల్ క్రెయిగ్ ని ఏజ్ బార్ అయ్యాక తీసుకున్నారు. అతను పర్ఫెక్ట్ గా సూటయ్యాడు కూడా. కానీ అతను బాండ్ సినిమా చేయడం కంటే మణికట్టు కోసుకుని చనిపోతానని చాలా గట్టిగా చెప్పాడు. అతనికి రెండు సినిమాలకు కలిపి 670 కోట్లు ఇస్తామని, రెండేళ్ల సమయం కేటాయించమని అడిగారట.

కానీ డేనియల్ నో చెప్పాడు. అందుకే ఈసారి ఏకంగా 35 ఏళ్ల జేమీ బెల్ ని బాండ్ ని చేయాలనుకుంటున్నారట నిర్మాతలు. టామ్ హార్డీ, హిడిల్ట్సన్, ఎల్బ్స్ లాంటి గొప్ప గొప్ప నటులు రంగంలో ఉన్నారని ప్రచారం జరిగినా కూడా అనూహ్యంగా బెల్ రంగంలోకి వచ్చాడు. ఇప్పటికే ఒక రౌండ్ చర్చలు కూడా ముగిశాయి. అతను ఓకే అయితే కొన్ని సీన్లు షూట్ చేసి, స్క్రీన్ కి అతను సూట్ అయితేనే తీసుకుంటారట. బాండ్ గెటప్ లో ఉన్న హీరో ఆ ఫీల్ తీసుకురావాలని నిర్మాతలు అంటున్నారు. ఇక యాక్టింగ్ పరంగా జేమీకి మంచి పేరే ఉంది. అడ్వెంచర్ ఆఫ్ టింటిన్, కింగ్ కాంగ్, జంపర్ లాంటి సినిమాల్లో నటించాడు.

ఆరేళ్ల క్రితం వచ్చిన బిల్లి ఎలియట్ సినిమా అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దాదాపుగా ఇతనే ఖాయమయ్యాడని ది ఇండిపెండెంట్, డెయిలీ మెయిల్ పత్రికలు తెలియజేసాయి.

English summary

New James Bond for James Bond movie