'అల్లరి కుర్రాడు, చలాకీ అమ్మాయి'

New Movie Started In Kalyan Cine Creations

06:27 PM ON 18th February, 2016 By Mirchi Vilas

New Movie Started In Kalyan Cine Creations

మరో కుర్ర హీరో సినీ ఆరంగేట్రం చేస్తున్నాడు. కాశ్యప్‌ను హీరోగా పరిచయం చేస్తూ కళ్యాణ్‌ సినీ క్రియేషన్స్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రీరామ్‌ బాలాజీ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో చాందిని కథానాయిక గా నటిస్తోంది. ఎం.జాహ్నవి నిర్మిస్తున్న ఈ కొత్త చిత్రం చిత్రీకరణ బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. తొలి సన్నివేశానికి దర్శకుడు కిశోర్‌ డాలి క్లాప్‌ ఇవ్వగా, నిర్మాత బసిరెడ్డి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. మరో నిర్మాత శివకుమార్‌ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా దర్శకుడు ఈ చిత్రం గురించి టూకీగా వివరిస్తూ ‘‘ఓ అల్లరి కుర్రాడు, చలాకీ అమ్మాయి మధ్య నడిచే సరదా ప్రేమకథ. బంటి బాణీలు ఆకట్టుకొంటాయి.' అన్నాడు. నిర్మాత మాట్లాడుతూ ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ వినోదభరితమైన ప్రేమకథాచిత్రం. మార్చి, ఏప్రిల్‌లలో చిత్రీకరణని పూర్తి చేస్తాం' అన్నారు. ఇక ఈ చిత్రంలోని ఆరు పాటలూ వైవిధ్యంగా ఉంటాయని బంటి అంటున్నాడు.

English summary

A new movie started by introducing new hro and heroine named Kyashyap and Jashnavi.This movie was going to be produced by Kalyan Cine Creations and direct by Sriram Balaji.