సరికొత్త ‘మ్యూజిక్‌ మెమోస్‌’ యాప్

New Music Memos App

12:41 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

New Music Memos App

సంగీతం వాయిద్యాలు వాయించడం.. పాటలు పాడటంలో ఇక ఏమాత్రం ప్రావీణ్యం లేకుండా మధురమైన సంగీతాన్ని ఎవరైనా కంపోజ్‌ చేసేయొచ్చు . నిజం అండీ బాబూ.... అదరగొట్టే డ్రమ్స్‌ సౌండ్స్‌తో ఆకట్టుకునే పాటలను రికార్డు చేయొచ్చు! అందుకు మీ స్మార్ట్‌ఫోన్‌లో ఓ యాప్‌ ఉంటే సరిపోతుంది. ఇందుకోసం స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం యాపిల్‌ తాజాగా ‘మ్యూజిక్‌ మెమోస్‌’ యాప్ ని అందుబాటులో తెచ్చేసింది.

నోటి నుంచి వచ్చే పదాలను, పియానో - గిటార్‌ వాయిస్తున్నప్పుడు వచ్చే సంగీతాన్ని ఈ యాప్‌తో రికార్డు చేసి, దానికి ఎలాంటి నేపథ్య సంగీతం ఉంటే బాగుంటుందో పరీక్షించవచ్చు. పలు రకాల డ్రమ్స్‌ సౌండ్‌ ట్రాక్‌లను కూడా జత చేయచ్చు. అంతేకాదు నచ్చినట్లు టెంపో మార్చుకునే సదుపాయం షురూ. ఇంకా చెప్పాలంటే, నచ్చని భాగాలను తొలగించి, వినసొంపుగా ఉన్న ట్రాక్‌లను కలిపి మధురమైన పాటగా రూపొందించొచ్చు. అంతటితో అయిపోలేదు, పాట పాడుతున్నా, పియానో - గిటార్‌ వాయిస్తున్నా, ఈ యాప్‌ అటోమేటిక్‌గా గుర్తించి రికార్డు చేసేస్తుందని అంటున్నారు. ఆ తర్వాత ఆ రికార్డులనే మనకు నచ్చినట్లు మార్చేసుకునే వెసులుబాటు ఉండనే వుంది.

సంగీతం నేర్చుకోవాలనుకొనే ఔత్సాహికులు, గాయకులకు ఈ ఐఓఎస్‌ యాప్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఇంత మంచి ఆఫర్లున్న ఈ యాప్ ని ఉచితంగా యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

English summary

A new app named Music Memos which allows the users to create music of their own and it also records the user voice and show the suitable music according to the user song.The ueser can download this app from iOS store for free of cost