కొత్త నేల్‌ పాలిష్‌ యాప్‌..

New Nail Polish App

06:10 PM ON 18th November, 2015 By Mirchi Vilas

New Nail Polish App

వివరాల్లోకి వెళ్తే ఫేస్‌కేక్‌ మార్కెటింగ్‌ టెక్నాలజీస్‌ వారు ఒక సరికొత్త యాప్‌ను విడుదల చేసారు. గూగుల్‌ ప్లే ద్వారా ఈ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఈ యాప్‌ సహాయంతో మనకి కావల్సిన ఏ రంగు నేల్‌ పాలిష్‌ నైనా మనం ఎంచుకోవచ్చని . దీనికి మనం చేయాల్సిందల్లా మనకి ఏదైనా రంగు నచ్చితే వెంటనే ఫోటో తీసి (లేదా)ఎదైనా ఫోటోను అప్‌లోడు చేసిన తరువాత ఆ ఫోటో లో నచ్చిన రంగుమీద క్లిక్‌ చేసి ఒకే బటన్‌ నొక్కగానే ఆ రంగు తో సరిపోతే వివిధ బ్రాండ్ల నేల్‌ పాలిష్‌ లను చూపిస్తుంది. అంతేకాక వినియోగదారుని యొక్క స్కిస్‌ కలర్‌,చేతిగోళ్ళ ఆకారాన్ని బట్టి మనకి సరితూగే నేల్‌ పాలిష్‌ ను ఎంచ్చుకొని కొనుగోలు చేయవచ్చు. ఈ 'షేడ్‌ స్కాట్‌ 'యాప్‌ సహాయంతో మనకి నచ్చిన రంగుతో పాటు,మనకి సరిపోలే రంగుని ఎంచ్చుకోవచ్చని,వినియోగదారునికి కావల్సిన రంగులను ఇట్టే కొనుగోలు చేయవచ్చని ఈ సంస్థ సిఈఓ స్మీత్‌ తెలిపారు.

English summary

ShadeScout Nails from FaceCake Marketing Technologies, Inc. is a free app that allows you to match almost any color you can find to its exact match of nail polish. It even gives you a range of options.