కన్యాకుమారికి కొత్త పేరు

New name for Kanya Kumari

05:01 PM ON 13th May, 2016 By Mirchi Vilas

New name for Kanya Kumari

క‌న్యాకుమారి త‌మిళ‌నాడులో ద‌క్షిణాన ఉన్న ఈ జిల్లాకు ఎంతో ప్రాచీన‌మైన చ‌రిత్ర ఉంది. మ‌న‌కు క‌న్యాకుమారిగా తెలిసిన ఈ ప‌ట్ట‌ణం పేరు మారిపోయింది. ఇక నుంచి క‌న్యాకుమారి పేరును కొత్త పేరుతో పిల‌వాల్సిందే. మ‌న‌దేశాన్ని పాలించిన ఆంగ్లేయులు కన్నియా కుమారి అని ప‌లికేందుకు నోరు తిర‌క్క‌పోవ‌డంతో క‌న్నియా కుమారిని కాస్తా క‌న్యా కుమారిగా మార్చేశారు. స్వాతంత్ర్యానంత‌రం కూడా ఆ ఊరిపేరు అంద‌రికి క‌న్యా కుమారిగా పాపుర‌ల్ అయ్యింది. రాష్ర్ట ప్ర‌భుత్వ పాల‌నా వ్య‌వ‌హారాల్లో క‌న్యాకుమారిగానే ఉన్నా కేంద్ర ప్ర‌భుత్వం, రైల్వేశాఖల్లో మాత్రం క‌న్నియా కుమారిగా ఉంది. అక్క‌డ రైల్వేస్టేష‌న్ల‌లో ఏర్పాటు చేసిన బోర్డుల‌తో పాటు టిక్కెట్ల పంపిణీలో కూడా క‌న్నియా కుమారి అనే రాస్తున్నారు.

దీంతో క‌న్యాకుమారి అస‌లు పేరు క‌న్నియా కుమారిగానే ఉంచాలంటే ఆ ప్రాంత‌ వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు పలు పోరాటాలు చేసి చివ‌ర‌కు విజ‌యం సాధించారు. కేంద్రం నుంచి ఆదేశాలు రావ‌డంతో నాగర్‌కోయిల్‌లోని కలెక్టర్‌ కార్యాలయంలోని బోర్డుల్లోనూ ఈ పేరు మార్చేశారు. కన్యాకుమారిగా పేరును తొలగించి, కన్నియాకుమారి బోర్డులను ఏర్పాటు చేశారు. దీంతో మ‌న‌దేశంలో, ముఖ్యంగా సౌత్‌లో క‌న్యాకుమారిగా పాపుల‌ర్ అయిన ఈ ఊరు పేరు ఇక నుంచి క‌న్నియా కుమారిగా మారింది.

English summary

New name for Kanya Kumari. Kanya Kumari new name is Kanniya Kumari.