అలాంటి వాళ్ళను జై అని పిలవాలట

New name for transgenders

03:10 PM ON 18th July, 2016 By Mirchi Vilas

New name for transgenders

నువ్వు ఏమైనా బొడ్డు కోసి పేరు పెట్టావా అని అనడం వింటూంటాం. అయితే ఇప్పుడు అటు ఇటూ కానీ వాళ్లకు ఓ కొత్త పేరు పెట్టారు. ఇంతకీ విషయం ఏమంటే, ట్రాన్స్ జెండర్ లు, స్వలింగ సంపర్కులను ఏమని పిలవాలి? అతడు.. అనాలా? ఆమె.. అనాలా? ఈ అనుమానాలు చాలామందిలో ఉండడం సహజం. అయితే దీనికి యూకేలోని బోర్డింగ్ స్కూల్స్ సంఘం కొత్త పరిష్కారం కనుగొంది. అలాంటి వాళ్ళను 'జై'(zie) అని సంబోధించాలని బోర్డింగ్ స్కూళ్లను ఆదేశించింది. తమను అతడు లేదా ఆమె అని పిలవకూడదని ట్రాన్స్ జెండర్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వీరి కోసం కొత్త పేరు కనుకొన్నారు.

'జై' అంటే లింగ భేదం లేని సర్వనామం. యూరప్, బ్రిటిష్ టీచర్లందరూ ఈ పదాన్ని వినియోగించవచ్చని యూకే బోర్డింగ్ స్కూల్స్ సంఘం తెలిపింది. మామూలుగా బృహన్నల వంటి పేర్లున్నా ఇప్పుడు వచ్చిన జై పేరు కూడా మనదేశంలో వాడుకలోకి వచ్చినా ఆశ్చర్య పడనక్కర్లేదు. దేనికైనా సై అనడం, జై కొట్టడం సహజమేగా.

English summary

New name for transgenders