అప్పో నుంచి మరో హై ఎండ్ స్మార్ట్‌ఫోన్..

New Phone Launched By Oppo

04:40 PM ON 10th December, 2015 By Mirchi Vilas

New Phone Launched By Oppo

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అప్పో ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. 'ఆర్7 ప్లస్' పేరిట ఓ నూతన హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. సెప్టెంబర్ లో ఆర్ 7 ప్లస్ ను అప్పో భారత్ లో విడుదల చేయగా.. ఇప్పుడు ఇదే పేరుతో హైఎండ్ ఫోన్ ను చైనాలో విడుదల చేసింది. దీనిని కంపెనీ వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ధర చైనాలో రూ. 31,100గా అంతర్జాతీయంగా రూ.34,300 ధరకు వినియోగదారులకు లభ్యమవుతోంది.

ఈ ఫోన్ ఆరు అంగుళాల ఫుల్ హెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లేతో లభ్యమవుతోంది. 4జీబీ ర్యామ్.. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ తో లభిస్తోంది. డ్యుయల్ సిమ్ తో పని చేసే ఈ ఫోన్ లో 1.5 జీహెచ్‌జడ్ 64 బిట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. మెమొరీని 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. 4100 ఎంఏహెచ్ నాన్ రిమువబుల్ బ్యాటరీ ఉంది. దీనిలో వూక్ చార్జింగ్ టెక్నాలజీ ఉంది. ఐదు నిమిషాలు చార్జ్ చేసి రెండు గంటలు వాడుకోవచ్చు. 30 నిమిషాల్లో 75 శాతం చార్జ్ అవుతుంది. 7.75 ఎంఎం ఉన్న ఈ ఫోన్ బరువు 182 గ్రాములు.

English summary

Oppo mobile company launched its smart phone R7 Plus and R7 Lite in indian market