మైక్రోమ్యాక్స్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్లు

New Phones From MIcromax

04:16 PM ON 10th December, 2015 By Mirchi Vilas

New Phones From MIcromax

దేశీయ మొబైల్స్ తయారీ దిగ్గజం మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మెగా సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. కాన్వాస్ మెగా ఇ353, కాన్వాస్ మెగా 4జి క్యూ417ల పేరిట వీటిని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇవి కాన్వాస్ మెగా ఇ353 ధర రూ.7,999గా, కాన్వాస్ మెగా 4జీ ధర రూ.10,999గా నిర్ణయించింది. ఇందులో కాన్వాస్ మెగా ఇ 353 ఫోన్ తక్షణం ఆన్ లైన్ లో అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. కాన్వాస్ మెగా 4జీకి సంబంధించి ఎప్పటి నుంచి లభిస్తుందనే విషయాలన్ని వెల్లడించలేదు.

కాన్వాస్ మెగా ఇ353 ఫీచర్లు ఇవే..

5.5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280X720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.4 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, డ్యుయల్ సిమ్, 2820 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

కాన్వాస్ మెగా 4జి క్యూ417 ఫీచర్లు ఇవీ..

5.5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280X720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

English summary

Micromax company has launched two smart phones named Canvas Mega (E353) and Canvas Mega 4G (Q417) at Rs. 7,999 and Rs. 10,999 The Micromax Canvas Mega (E353) will be available in the market