మిస్డ్‌కాల్‌ ఇవ్వండి ఫోన్‌ రిపేర్‌ చేయించుకోండి

New Pick MI Service From Xiaomi

11:00 AM ON 28th December, 2015 By Mirchi Vilas

New Pick MI Service From Xiaomi

ఒక్క మిస్డ్‌కాల్‌ ఇస్తే చాలు వారే స్వయంగా మీ ఇంటికి వచ్చి మీ ఫోన్‌ను రిపేర్‌ చేస్తారు. అవును మీరు విన్నది నిజంగా నిజమే.

చైనా మొబైల్ దిగ్గజం జియోమి కంపెనీ వారు సరికొత్తగా 'పిక్‌ ఎంఐ' (PICK MI) పేరుతో ఓ సరికొత్త సర్వీసును ప్రారంభించారు. ఈ సర్వీసు సహాయంతో మనం జియోమి ఉత్పత్తులను ఇంటి నుండే రిపేరు చేయించుకునే సౌలభ్యాన్ని కల్పించారు. దీనికి మనం చెయ్యాల్సిందల్లా 18001036286 లేదా 7676404444 నెంబరుకు ఒక మిస్డ్‌కాల్‌ ఇస్తే చాలు. ఈ సరికొత్త సర్వీసుకు జీయోమి వినియోగదారులు 189 రూపాయలను చెల్లించవలసి ఉంటుంది. ఈ సర్వీసు ప్రస్తుతం భారత్‌లోని 599 నగరాల్లోకి అందబాటులోకి తీసుకువచ్చారు. ఇలా మిస్డ్‌కాల్‌ ద్వారా వచ్చిన జియోమి సిబ్బంది కేవలం 24 గంటల లోపే రిపేరు చేసి వినియోగాదారుడికి అందిస్తారు. ఇలాంటి ఎన్నో సర్వీసులతో జియోమి కంపెనీ భారత్‌ లో దూసుకుపోతుంది.

English summary

Good news for Xiaomi customers. You can now give a missed call for Pick Mi service.