న్యూ ఇయర్ వాట్సాప్ మెసేజ్ ల మోత .. సరికొత్త రికార్డ్ క్రియేట్

New record was created by Whattsup messages on New year day

11:59 AM ON 7th January, 2017 By Mirchi Vilas

New record was created by Whattsup messages on New year day

సోషల్ మీడియాలో తనదైన శైలిలో దూసుకుపోతున్న వాట్సాప్ లో ఉదయం లేచిన దగ్గర్నుంచి మళ్లీ నిద్ర పోయేవరకు గుడ్ మార్నింగ్ , హాయ్ , హలో, గుడ్ నైట్ .. అంటూ మెసేజ్ ల మోతే. ఇలా మెసేజ్ లు పంపించుకోవడం ఇప్పుడు అందరికీ అలవాటైపోయింది కూడా. అంతేకాదు పండగ రోజుల్లో అయితే ఒకరికొకరు పోటీపడి శుభాకాంక్షలు తెలుపుకోవడం కూడా సర్వసాధారణం. అలా నూతన సంవత్సరం సందర్భంగా మన దేశంలో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొంటూ పంపించిన సందేశాలెన్నో తెలుసా? అక్షరాలా.. 1400 కోట్లు. ఇప్పటి వరకు ఇన్ని సందేశాలు ఒక్కరోజు పంపించడం ఇదే తొలిసారని వాట్సాప్ శుక్రవారం వెల్లడించింది.

గత దీపావళి సందర్భంగా దేశంలో 800 కోట్ల సందేశాలను పంపించుకోవడమే అత్యధికం కాగా.. ఆ రికార్డును న్యూఇయర్ తిరగరాసింది. కొత్త సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ 310 కోట్ల చిత్రాలు ఒకరికొకరు పంచుకున్నారు. 70 కోట్ల జిఫ్ సందేశాలు, 61కోట్ల వీడియోలను పంపించుకున్నట్లు వాట్సాప్ తెలిపింది. మొత్తం సందేశాల్లో 32శాతం మీడియా రూపంలోనే ఉన్నాయని పేర్కొంది. మిగిలినవి టెక్ట్స్ సందేశాలని తెలిపింది.

వాట్సాప్ కు భారత్ లో నెలకు 16కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. కాగా, పాత ఆండ్రాయిడ్ , ఐఓఎస్ , విండోస్ వెర్షన్ ఫోన్లలో డిసెంబర్ 31 తర్వాత వాట్సాప్ తమ సర్వీసును నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చూడండి: ఆ సందర్భాల్లో తేనె వాడితే ….. చాలా ప్రమాదం

ఇది కూడా చూడండి: ఈ దేశాలలో మన రూపాయి విలువ చాలా ఎక్కువ

ఇది కూడా చూడండి: చర్చిలో మార్మోగిన పంచాక్షరీ మంత్రం

English summary

We all know that Whattsup a famous social media to exchange information easily. On January 1st of 2017 only in India 1400Crores messages were send to the people to wish them on New Year.It was a record created.