మొబైల్‌లో అమ్మ భాషకు పట్టం !

New Rule By Telecom Department

07:03 PM ON 15th February, 2016 By Mirchi Vilas

New Rule By Telecom Department

ఎవరి భాష వారికి ముద్దు. అయితే విస్తృతంగా వినియోగించే మొబైల్ ఫోన్లలో ఇంగ్లీషు తదితర భాషలకే ఎక్కువ ప్రాధాన్యత వుండడం వలన వస్తున్న ఇబ్బందులను గమనించిన సర్కార్ ఇక నుంచి అమ్మభాషకు పట్టం కట్టాలని నిర్ణయించింది. ఈమేరకు భారత టెలికాం శాఖ సరికొత్త నియమం తీసుకువస్తోంది. ఇక నుంచి మొబైల్‌ఫోన్లు హిందీ, అలాగే కనీసం ఒక ప్రాంతీయ భాషలో పనిచేసేలా రూపొందించాలని నియమావళిలో మార్పులు చేస్తోంది. మాతృ భాషాభిమానులకు టెలికం తాజా నిర్ణయం తీపి కబురు అవుతుందనడంలో సందేహం లేదు.

‘మొబైల్‌ ఫోన్లు హిందీ, ఇంగ్లిష్‌, ఏదైనా ఒక ప్రాంతీయ భాష సపోర్ట్‌ చేసేలా టెలికాం శాఖ మూడు నెలల్లోపు నియమం తీసుకురానుంది’ అని ఆ శాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఈ విధంగా కంపల్సరీ చేయడం ద్వారా ఎవరి మాతృ భాష వారికి అందుబాటులో వుంటుంది. మరో 3-4 నెలల్లో ఇది కార్యరూపం లోకి వచ్చే అవకాశం వున్నట్లు తెలియ వచ్చింది. వినియోగదారులు ప్రాంతీయ భాషలో మొబైల్‌ వినియోగించేలా, ఈ- పంచాయతీ లాంటి ప్రభుత్వ సేవలను కూడా సులభతరంగా ఉపయోగించుకునే లక్ష్యంతో ఈ నియమం ప్రవేశ పెడుతున్నారని వినికిడి.

డిజిటల్‌ ఇండియా విజయవంతం కావాలంటే ఆంగ్లం మాట్లాడగలిగే మధ్య, ఉన్నత వర్గాల వారికే బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు చేరువ చేయాలని చేపడుతున్న అమ్మ భాషకు మొబైల్ లో అగ్ర తాంబూలం సత్ఫలితాలు వచ్చేలా చేయడానికి కార్యాచరణ కూడా రూపొందించనున్నారట. ఇప్పటికే ప్రజల్లో డిజిటల్‌ అక్షరాస్యతపై శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం డిజిటల్‌ సాక్షరత అభియాన్‌ (దిశ) కార్యక్రమం నిర్వహిస్తోంది కూడా. మొత్తానికి భాషాభిమానులకు ఇది శుభవార్తే.

English summary

Telecom Ministry of India have bought a new rule that in mobile phones there should be One Local Language along with Hindi and English.