బాలికల స్కూళ్ళకు వెళ్ళడానికి మగ టీచర్లకు కండీషన్

New rule for male teachers in Haryana

10:58 AM ON 15th July, 2016 By Mirchi Vilas

New rule for male teachers in Haryana

బాలికలకు రక్షణ కల్పించాలనో, మరో ఉద్దేశ్యంతోనో హర్యానాలో స్కూలు టీచర్లకు అక్కడి ప్రభుత్వం ప్రకటించిన కొత్త ట్రాన్సఫర్ పాలసీ యువ ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిందట. వివరాల్లోకి వెళ్తే.. 50 ఏళ్ళు, అంతకు మించిన వయస్సు దాటిన మగ ఉపాధ్యాయులే బాలికల స్కూళ్ళకు ట్రాన్సఫర్ కావడానికి అర్హులని అక్కడి ప్రభుత్వం నిర్దేశించింది. ఈ వయస్సు లోపున్న ఉపాధ్యాయులు బదిలీని కోరుకున్నా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. బుధవారం నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయని విద్యా శాఖ మంత్రి రామ్ విలాస్ వర్మ తెలిపారు.

రాష్ట్రంలో టీచర్ల బదిలీల విధానాన్ని మెరుగుపరచేందుకే ఈ పద్ధతిని అమల్లోకి తెచ్చామని, పైగా విద్యార్థులకు కూడా దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు. అయితే ఈ కొత్త బదిలీ ఉత్తర్వులపై అప్పుడే మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పద్ధతి వల్ల యువ మగ ఉపాధ్యాయులు నష్టపోతారని, వారి ఉద్యోగావకాశాలకు ఇది గండి కొట్టడమేనని కొందరు అంటున్నారు. అయితే ఈ విధానం వల్ల సీనియర్ల ఎడ్యుకేషనల్ అనుభవాలు విద్యార్థినులకు ఉపయోగపడతాయని మరికొందరు దీన్ని సమర్థిస్తున్నారు. మొత్తానికి భలే నిబంధన అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

English summary

New rule for male teachers in Haryana