ఇక అలాంటి పప్పులుడకవ్....

New Rules In Telangana Assembly

12:11 PM ON 1st March, 2016 By Mirchi Vilas

New Rules In Telangana Assembly

తెలంగాణా అసెంబ్లీలో కొత్త నిర్ణయాలు అమల్లోకి రాబోతున్నాయి. ఇక నుంచి సభ్యులు ఇష్టం వచ్చినట్లు వ్యహరిస్తే కుదరదట. తమ డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేయటం ప్రతిపక్షాలు చేసే పనే. ఇందులో భాగంగా అధికారపక్షాన్ని ఇబ్బంది పెట్టేలా సభను అడ్డుకోవటం లాంటివి చేస్తుంటారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవటమే కాదు.. కాగితాల్ని చించేయటం.. మైకులు ఇరగదీయటం లాంటి ఘటనలు చాలానే చేసే చేస్తుంటారు. అయితే ఇక నుంచి ఇవి చెల్లవని అంటోంది తెలంగాణా సర్కార్. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకున్న తాజా నిర్ణయాలు చూస్తుంటే, ఇక పప్పులు ఉడకవ్ అన్నట్లే వున్నాయి. శాసనసభ నిబంధనల రూపకల్పన కమిటీ సమావేశం శాసనసభాపతి మధుసూదనాచారి నేతృత్వంలో జరిగింది. ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌, భాజపా శాసనసభాపక్ష నేత లక్ష్మణ్‌, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యే వివేకానంద, సీపీఎం పక్ష నేత సున్నం రాజయ్య, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, శాసనసభ కార్యదర్శి రాజాసదారాం తదితరులు హాజరయ్యారు.

తెలంగాణ అసెంబ్లీ నిర్వహణకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాల్ని ఈ సందర్భంగా తీసుకున్నారు. తాజా రూల్స్ ప్రకారం గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటే.. సదరు ఎమ్మెల్యేపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడుతుంది. అంతేకాదు.. క్వశ్చన్ అవర్ లో ఆందోళనలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. ఎపి అసెంబ్లీలో వైసిపి ఎంఎల్ఎ రోజాను ఏడాది పాటు సస్పెన్షన్ చేసిన ఎపి అసెంబ్లీ ని తెలంగాణా సర్కార్ ఆదర్శంగా తీసుకుందా? ఇక వరుసగా వేటు వేయడమే తరువాయా?

English summary

Telangana Rastra Samiti(TRS) Government to bring new rules and Regulations in Telangana Assembly.According to this new rules if any MLA who was objected Governers Speech has to face one year Suspension from the Assembly.