2016లో శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే..

New Samsung Smart Phones That Release In 2016

04:41 PM ON 7th December, 2015 By Mirchi Vilas

New Samsung Smart Phones That Release In 2016

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ సంస్థ శాంసంగ్ రానున్న 2016 సంవత్సరంలో విడుదల చేయనున్న 3 కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్స్ గురించిన వివరాలను తాజాగా ప్రకటించింది. 'గెలాక్సీ ఎ3, గెలాక్సీ ఎ5, గెలాక్సీ ఎ7'ల పేరిట ఈ ఫోన్లు విడుదల కానున్నాయి. అయితే ఇవి కొత్త ఫోన్లు కాకపోవడం గమనార్హం. ఇప్పటికే ఉన్న ఫోన్లకు అదనపు ఫీచర్లను కలపి 2016 ఎడిషన్ గా మార్కెట్ లోకి తీసుకొస్తోంది. శాంసంగ్. అయితే వీటి ధర వివరాలు త్వరలో తెలుస్తాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎ7 ఫీచర్లు

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1920X1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 3జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, బ్లూటూత్ 4.1, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎ5 ఫీచర్లు

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1920X1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, బ్లూటూత్ 4.1, 2900 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎ3 ఫీచర్లు

4.7 ఇంచ్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1280X720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, బ్లూటూత్ 4.1, ఎన్‌ఎఫ్‌సీ, 2300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

English summary

Samsung Mobile Company To Release New Smart Phones in 2016 . The smart phones like A3,A5,A7 were released by adding extra features