'నాన్నకు ప్రేమతో' కొత్త సీన్లు చేర్పు!!

New scenes added in Nannaku Prematho movie

11:20 AM ON 22nd January, 2016 By Mirchi Vilas

New scenes added in Nannaku Prematho movie

ఈ మధ్య సినిమాల రన్‌ టైం తగ్గించేందుకు ఎడిటింగ్‌ లో చాలా సన్నివేశాలను కట్‌ చేస్తున్నారు. సినిమా రన్‌ టైం ఎక్కువై ప్రేక్షకులకు బోర్‌ కొడుతుందనే ఉద్దేశంతో కోట్లు ఖర్చుపెట్టి చిత్రీకరిస్తున్న సన్నివేశాలు సైతం కట్‌ చేసేస్తున్నారు. ఎన్‌టీఆర్ 'నాన్నకు ప్రేమతో' సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. సుకుమార్‌ ఎంతో ఇష్టంగా రాసిన సన్నివేశాలు సైతం కట్‌ చేశారట. అయితే ఈ సినిమా పై మిశ్రమ స్పందన రావడంతో ఈ సన్నివేశాలను జోడించాలని చిత్ర యూనిట్‌ నిర్ణయించుకున్నారు. అయితే ఎన్‌టీఆర్ ఈ సన్నివేశాలలో ఉండడట. ఈ సన్నివేశాలు జగపతిబాబు పైనే ఉంటాయట. కానీ ఆ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని, వీటిని యాడ్‌ చేయడం ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

English summary

New scenes added in Nannaku Prematho movie. Young Tiger Ntr and Rakul Preet Singh romanced first time in this movie. Sukumar were directed this movie.