జనతా గ్యారేజ్ లో కొత్తసీన్స్ యాడ్ అయ్యాయి

New Scenes Added To Janata Garage Movie

10:46 AM ON 9th September, 2016 By Mirchi Vilas

New Scenes Added To Janata Garage Movie

చాలా సినిమాలకు జరిగినట్టే జనతా గ్యారేజ్ కి కూడా జరిగింది. ఈ సినిమాలోనూ తన సెంటిమెంట్ ని డైరెక్టర్ కొరటాల శివ కొనసాగించాడు. రిలీజైన రెండువారాల తర్వాత కొన్ని సీన్లు యాడ్ చేశాడు. జనతాగ్యారేజ్ సినిమాలో ఎలాంటి పరిచయం లేకుండా సాంగ్ తో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. అయితే, అమెరికాలో ప్రదర్శించిన వెర్షన్ లో మాత్రం ఇంట్రడక్షన్ సీన్ ఉంది. మొక్కల ప్రాధాన్యం గురించి తెలుపుతూ సాగుతుందా సీన్. ఇప్పుడు అదే సీన్ ని మూవీలో యాడ్ చేశారట.

అంతేకాదు, సమంత-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చే మరికొన్ని సీన్లు కూడా కలిపారట. గతంలో రిలీజైన మిర్చి, శ్రీమంతుడు సినిమాల్లో కూడా కొరటాల శివ ఇలాగే రిలీజ్ తర్వాత ప్రేక్షకుల రియాక్షన్స్ పరిగణలోకి తీసుకుని అదనంగా సీన్స్ కలిపాడు. ఇప్పుడూ అదే సీన్ రిపీట్ చేశాడు. మిర్చి మూవీ రిలీజైన మూడు వారాలకు కలిపిన వర్షం ఫైట్ ఎంత సన్సెషన్ అయిందో తెలిసిందే. మరి ఇప్పుడు కొత్త సీన్లు కలపడంతో జనతా ఏ రేంజ్ కి వెళుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:అఖిల్ పెళ్లి ఫిక్స్ .. డిసెంబర్ 9న నిశ్చితార్ధం

ఇవి కూడా చదవండి:సభకోసం జనసేన నేత కాకినాడ వచ్చేసాడు(వీడియో)

English summary

Young Tiger NTR and Director Koratala Shiva got hatrick hit with the movie Janata Garage and now this movie was going successfully in the theaters. Now this film unit announced that few new scenes have been added to this movie like an introduction scene of NTR and few scenes between NTR and Samantha.