జబర్ధస్త్ కు దీటుగా వీళ్ళతో కొత్త షో!

New show against Jabardasth

12:07 PM ON 14th November, 2016 By Mirchi Vilas

New show against Jabardasth

బుల్లితెరమీద జబర్ధస్త్ లాంటి విభిన్న తరహా ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేశారట. త్వరలోనే ఓ ఛానెల్ టెలికాస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తోందట. ఇప్పటికే మెగా బ్రదర్స్ లో మధ్యవాడైన నాగబాబు, అలనాటి స్టార్ హీరోయిన్ రోజా న్యాయనిర్ణేతలుగా రెండేళ్ల క్రితం మొదలైన జబర్ధస్త్ తెలుగు బుల్లితెరపై సెపరేట్ ట్రెండ్ క్రియేట్ చేసింది. అడెల్ట్ కంటెంట్ ఎక్కువని విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ టీఆర్పీ రేటింగ్స్ లో మాత్రం దూసుకుపోతోంది. ఈ ప్రోగ్రాం జనాల్ని నవ్వుల్లో ముంచెత్తుతోంది. ఎంతోమంది ప్రతిభావంతులను వెండితెరకు పరిచయం చేసింది. మరెంతోమందికి జీవనోపాధి కల్పిస్తోంది.

అయితే తెలుగునాట ఇంతగా ఆదరణ పొందుతున్న ఈ ప్రోగ్రామ్ కు చెక్ పెట్టేందుకు మరో ఛానల్ పావులు కదుపుతోందట. ఆ షోకు పోటీగా అదే తరహా ప్రోగ్రామ్ ను మరింత వైవిధ్యంగా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే అందులో అడెల్ట్ కంటెంట్ ను బాగా తగ్గించి, ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందిస్తారట. ఈ ప్రోగ్రామ్ న్యాయనిర్ణేతలుగా పోసాని కృష్ణమురళీ, రమ్యకృష్ణలను కూర్చోబెడతారట. అతి త్వరలోనే ఈ ప్రోగ్రామ్ రంగ ప్రవేశం చేయనుందట. మరి, తెలుగునాట ఈ ప్రోగ్రామ్ ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

English summary

New show against Jabardasth