రెండు కెమెరాలతో కొత్త ఫోన్ 

New Smart Phone With Two Back Cameras

03:45 PM ON 28th November, 2015 By Mirchi Vilas

New Smart Phone With Two Back Cameras

ఈ కాలం లో స్మార్ట్ ఫోన్లకు ఉన్నంత క్రాజే అంతా ఇంతా కాదు. అనేక కంపెనీలు మొబైల్ మార్కెట్లో సత్తా చాట కొత్త కొత్త ఫీచర్ల తో ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవ్తునే ఉన్నాయి. లెనోవో వారు విడుదల చేసిన వైబ్ లో ముందు రెండు కెమెరాలు తో విడుదల చేసింది. తాజాగా చైనా కు చెందిన మరో సంస్థ మార్కెట్ లోకి వెనుక భాగం లో రెండు కెమెరాలు కలిగిన ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రముఖ మొబైల్ సంస్థలు కూల్ ప్యాడ్ డాజేన్, కిహు 360 టెక్నాలజీస్ కలిసి ఈ క్యూతేరా 808 మొబైల్ ఫోన్ ను తయారు చేసారు. వెనుక భాగం లో రెండు కెమెరాలు కలిగి వుండడం ఈ ఫోన్ ప్రత్యేకత. డిసెంబర్ 5 నుండి ఈ ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి .

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే 6 అంగుళాల టచ్ స్క్రీన్ , 2 గిగా హెర్ట్జ్ ప్రాసెసర్ ,3 జీబి రామ్ , 16 జీబి ఇంటర్నల్ మెమరీ ,ముందు భాగంలో 8 మెగా పిక్సెల్ ల కెమెరా ,వెనుక భాగం లో రెండు 13 మెగా పిక్సెల్ ల కెమెరాలు వున్నాయి, ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టం తో ఈ ఫోన్ రానుంది .ఈ ఫోన్ ధర 19,999 రూపాయలుగా ఉండబోతునట్టు సమాచారం.

English summary

A new phone launched in indian mobile market name Qiku Terra 808 smart phone .Its has two 13 mega pixel camers on back side of the phone .