ఇకపై స్మార్ట్ ఫోన్ ల ఛార్జింగ్ ఎన్ని రోజులు వస్తుందో తెలిస్తే అవాక్కవుతారు!

New smart phones batteries

12:32 PM ON 23rd November, 2016 By Mirchi Vilas

New smart phones batteries

ఈరోజుల్లో ప్రతి ఒక్కరి చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఇక 4జి వచ్చాక, అదేపనిగా నెట్ వాడకం చేసేస్తున్నారు. అందుకే ఒకసారి ఛార్జింగ్ చేసిన స్మార్ట్ ఫోన్ రోజంతా పని చేయడమే కష్టం. అత్యవసర సమయంలో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి పడేపాట్లు అన్నీ ఇన్నీ కావు. ఈ బాధలన్నీ ఇక త్వరలో తీరనున్నాయి. ఒకసారి ఛార్జ్ చేసిన శక్తితో కొన్ని వారాల పాటు ఫోన్ ను పని చేయించే సూపర్ కెపాసిటర్ బ్యాటరీలను అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. స్మార్ట్ ఫోన్లలోని లిథియం బ్యాటరీని ఈ కొత్త సూపర్ కెపాసిటర్స్ తో మార్చుకుంటే, కేవలం కొన్ని సెకెండ్లలోనే ఛార్జ్ అవడంతో పాటు వారం రోజుల పాటు మీ ఫోన్ కు ఛార్జింగ్ చేయనక్కర్లేదు.

ఈ సూపర్ కెపాసిటర్స్ ను నానో మీటర్ మందంతో ఉన్న లక్షల వైర్లు, 2డీ పదార్థాలతో తయారు చేశారు. సాధారణ లిథియం బ్యాటరీని 1500 సార్లు చార్జ్ చేయవచ్చు. అదే 2డీ పదార్థాలతో తయారయిన సూపర్ కపాసిటర్స్ ను 30 వేల సార్లు ఛార్జింగ్ చేయవచ్చని యూనివర్సిటీ ఆఫ్ సింట్రల్ ఫ్లోరిడా శాస్త్రవేత్త నితిన్ చౌధరి తెలిపారు. సూపర్ కపాసిటర్స్ ను అన్ని రకాల ఎలక్ట్రిక్ ఉపకరణాలు, ఎలక్ట్రిక్ కార్లకు ఉపయోగించవచ్చుకోవచ్చట. ఇక ఎందుకు ఆలస్యం వెంటనే ఆర్డర్ చేసెయ్యండి.

English summary

New smart phones batteries