ట్రైన్ టికెట్ క్యాన్సిలేషన్ కోసం సరికొత్త సాఫ్ట్ వేర్

New software to cancel the train ticket

01:10 PM ON 30th September, 2016 By Mirchi Vilas

New software to cancel the train ticket

ఏదైనా ఊరు వెళ్ళడానికి కొద్ది రోజులముందే ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవడం రివాజు. అయితే కొన్ని సందర్భాల్లో రైలు ప్రయాణం రద్దు చేసుకోవల్సి రావడమో, టిక్కెట్ పై ప్రయాణించకపోవడమో జరుగుతోంది. ఆ సమయంలో టిక్కెట్ రద్దు చేసుకోవటం వీలుపడక చాలా మంది ఆ టిక్కెట్లను అలాగే వదిలేస్తుంటారు. దీని వల్ల వినియోగదారులు టిక్కెట్ రుసుము పూర్తిగా నష్టపోవాల్సి వస్తోంది. దీన్ని నివారించేందుకు ఇండియన్ రైల్వేస్ ఓ వినూత్న అవకాశాన్ని కల్పిస్తోంది. ఒక్క ఫోన్ కాల్ తో రైల్వే టిక్కెట్ రద్దు చేసుకునేలా కొత్త సాఫ్ట్ వేర్ ను అభివృద్ది చేసింది. ఈ వెసులుబాటు వచ్చే నెల నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు.

దీని ప్రకారం వినియోగదారులు మొబైల్ ఫోన్ నుంచి 139 నెంబర్ కు ఫోన్ చేసి టిక్కెట్లు రద్దు చేసుకోవచ్చు. ఈ నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు చెప్తే టిక్కెట్ రద్దు అవుతుంది. వెంటనే ఫోన్ కు ఓ పాస్ వర్డ్ వస్తుంది. దీని ద్వారా టిక్కెట్ డబ్బులు వాపస్ పొందవచ్చు. ఈ పధ్ధతి అమల్లోకి వస్తే, చాలామందికి వెసులుబాటేనని చెప్పక తప్పదు.

English summary

New software to cancel the train ticket