స్పీడ్ బ్రౌజర్ 4జీతో బ్రౌజింగ్ సో స్పీడ్

New Speed Browser 4G

01:24 PM ON 25th January, 2016 By Mirchi Vilas

New Speed Browser 4G

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఓ అలవాటు. వీరికోసం గూగుల్ ప్లే స్టోర్‌లో అనేక రకాల బ్రౌజింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో స్పీడ్ బ్రౌజర్ 4జీ యాప్ ఇప్పుడు యూజర్లను ఆకట్టుకుంటోంది. 2 ఎంబీ సైజ్ మాత్రమే ఉండే ఈ యాప్ కొత్త వెర్షన్‌ను ఇప్పుడు యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ డేటా కనెక్షన్ ఎంత స్పీడ్ ఉన్నా దీంట్లో సులభంగా, వేగంగా బ్రౌజ్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఈ ఇంటర్నెట్ బ్రౌజర్ యాప్‌లో యూజర్లు తమకు ఇష్టమైన వివిధ సైట్లకు చెందిన లింక్‌లను ఫేవరెట్లుగా సెట్ చేసుకోవచ్చు. గూగుల్, యాహూ, బింగ్ తదితర సెర్చ్ ఇంజిన్లలో తమకు నచ్చిన దాన్ని వారు డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా సెట్ చేసుకోవచ్చు. యూజర్లు అంతకు ముందు దర్శించిన సైట్లను మళ్లీ కావాలంటే సులభంగా బ్రౌజ్ చేసుకునే వీలు కల్పించారు. సెర్చ్‌బార్‌లో ఏదైనా టైప్ చేసిన వెను వెంటనే బ్రౌజర్ విండోలో రిజల్ట్స్ ప్రత్యక్షమవుతాయి. ఇతర బ్రౌజర్ల మాదిరిగానే దీంట్లోనూ టాబ్‌ల రూపంలో సైట్లను బ్రౌజ్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తున్నారు. వీటితోపాటు ప్రైవేట్ బ్రౌజింగ్, నైట్ మోడ్, డౌన్‌లోడ్ మేనేజర్, వాయిస్ సెర్చ్, బుక్‌మార్క్ మేనేజర్, నో ఇమేజ్ మోడ్, స్పీడ్ మోడ్, గేమ్ మోడ్ వంటి వివిధ రకాల ఫీచర్లను ఇందులో అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్షన్ కలిగిన డివైస్‌లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది.

English summary

A new web browsing app named Speed Browser 4G has attracted the customers by its features and we can download this ap fror free of cost from google play store.The specila features in this browser were Request desktop page,Facebook updates in browser,Toogle reading mode.