సామ్సంగ్ కొత్త  గాలక్సీ S2 టాబ్లెట్ 

New Tablets Announced By Samsung

04:34 PM ON 25th November, 2015 By Mirchi Vilas

New Tablets Announced By Samsung

మొబైల్ ఫోన్ల తయారి రంగంలో తనకంటూ ఒక ప్రత్యక స్థానం ఏర్పరచుకున్న కొరియా మొబైల్ దిగ్గజం సామ్సంగ్ తన కొత్త గాలక్సీ S2 టాబ్లెట్ ఫోన్ ను ప్రకటించింది. గత సంవత్సరం విడుదల చేసిన గాలక్సీ టాబ్ S కు ఇది అప్ గ్రేడేడ్ వెర్షన్ . ఈ కొత్త గాలక్సీ S 2 డిజైన్ మీద ప్రత్యక దృష్టి సారించింది. ఈ టాబ్లెట్ ఫోన్ ను 5.6 మిల్లి మీటర్ల మందం తో తయారు చేసింది అంటే ఆపిల్ ఐ-ప్యాడ్ కన్నా స్లిమ్ టాబ్లెట్ అని చెప్పచ్చు. ఈ కొత్త టాబ్లెట్ ఫోన్ 8 మరియు 9.7 ఇంచులతో రెండు సైజులలో లభ్యం కానుంది దీని బరువు విషయానికి వస్తే 8 ఇంచులు గల టాబ్లెట్ 265 గ్రాములు , 9.7 ఇంచులు గ టాబ్లెట్ 389 గ్రాములు గా ఉంటాయి. ఈ టాబ్లెట్ బరువు మందం కలిసి ఈ గాలక్సీ S2 టాబ్లెట్ ను మరింత పోర్టబుల్ డివైస్ గా చేసాయి.

ఈ గాలక్సీ S2 టాబ్లెట్ ఫీచర్ల విషయానికి వస్తే సామ్సంగ్ వారి ప్రఖ్యాత సూపర్ AMOLED డిస్ప్లే తో మరింత స్పష్టంగా ఈ టాబ్ లో వీడియో లు,ఫోటోలు మనం చూడచ్చు. ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.0 వెర్షన్ తో ఈ టాబ్ రానుంది. 3 జీబి రామ్ , 32 లేదా 64 జీబి ఇంటర్నల్ మెమరీ , 128 జీబి వరకు మైక్రో ఎస్ డి కార్డుతో ఇంటర్నల్ మెమరీ ని పెంచుకునే సౌలభ్యం ఉంది . వెనుక భాగం లో 8 మెగా పిక్సెల్స్ కెమెరా , ముందు భాగంలో 2.1 మెగా పిక్సెల్స్ కెమెరాలు ఈ టాబ్లెట్ ఫోన్ లో ఇమిడి ఉన్నాయి. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే 1.9 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్ తో రానుంది .

సామ్సంగ్ గాలక్సీ S2 టాబ్లెట్ ను ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు నెలలో అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపారు . నలుపు, తెలుపు రెండు రంగుల్లో ఈ టాబ్ లభ్యమవుతుందని తెలిపారు. ఐతే ఈ టాబ్ ధర ఎంత ఉంటుందని మాత్రం సామ్సంగ్ చెప్పలేదు. ఈ గాలక్సీ S2 టాబ్లెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకొవాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.


English summary

Samsung announces its new tablets in galaxy S series. It is going to release its new galaxy S2 tablets in two different sizes like 8 inches and 9.7 inches. Its desing soo thin when compared apple i-pad.It comes with Siuper AMOLED display,8 megapixels of front camera,2.1 megapixels of back camera,3GB ram,32 or 64 internal storage,128 GB of expandable memory. Samsung yet now not released the price of these Galaxy S2 Tablets