జికా పై రివర్స్ అటాక్ 

New Technique To Avoid Zika Virus

05:36 PM ON 1st February, 2016 By Mirchi Vilas

New Technique To Avoid Zika Virus

ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్ జికా. ఈ వైరస్ పై పోరుకు పరిశోధకులు సరికొత్త ఆయుధాన్ని ఎంచుకున్నారు. జికా వైరస్‌ను వ్యాప్తి చేస్తున్న దోమలపై పోరుకు వారు దోమలనే ఎంపిక చేసుకున్నారు. అయితే ఇవి సాధారణ దోమలు కాదు. జన్యుమార్పిడితో జికా వైరస్‌ వ్యాప్తి దోమలను ఆకర్షించి నిర్మూలించే శక్తి కలిగినవి. యుక్త వయస్సుకు చేరుకునే లోపే మరణించే ఈ దోమలు జికా వ్యాప్తికారక దోమలను ఆకర్షించటంలో విజయం సాధించాయని, ఈ దోమల సంఖ్య దాదాపు80 శాతం మేర తగ్గినట్లు ప్రయోగాత్మక పరీక్షల్లో రుజువైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవ సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా జన్యుమార్పిడితో రూపొందించిన ఈ సరికొత్త దోమలు జికా వ్యాప్తి కారక దోమలపై సరికొత్త మారణా యుధంగా మారాయి. జికా వైరస్‌ వ్యాప్తిచేసే దోమల నిరోధానికి సంప్రదాయకంగా అనుసరించే పెస్టిసైడ్స్‌, దోమతెరల వినియోగం, మరుగునీటి తొలగింపు వంటి చర్యలు సత్ఫలితాలనివ్వని నేపథ్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ జన్యుమార్పిడి దోమలను రూపొందించినట్లు శాస్త్రవేత్తలు వివరించారు

English summary

A new weapon was has been introduced by the scientists to contorl Zika virus.Scientists said that they made some mosquitoes which were used to kill Zika Virus Mosquitoes