బాలయ్యను కన్‌ఫ్యూషన్‌ లో పడేసిన సూర్య

New Twist In Ballaya 100th Movie

02:54 PM ON 27th January, 2016 By Mirchi Vilas

New Twist In Ballaya 100th Movie

నందమూరి బాలకృష్ణ వందో సినిమా ఆదిత్య 999. ఈ సినిమా ఆదిత్య 369 కి సీక్వెల్‌ గా తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రారంభం కాకముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు తమిళ స్టార్‌హీరో సూర్య 24 సినిమా టైం మిషన్‌ ఆధారంగా తెరకెక్కింది. ఈ టైం మిషన్‌ సాయంతో సూర్య గతంలోకి, భవిష్యత్తులోకి ప్రయాణిస్తూ ఉంటాడు. ఆదిత్య 369 సీక్వెల్‌ కిముందే విక్రమ్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సూర్యకి తెలుగులో కూడా మార్కెట్‌ ఉండడంతో భారీ ఎత్తులో ఈ సినిమాని విడుదల చెయ్యనున్నారు. బాలయ్య ఆదిత్య 999 సినిమా కూడా దాదాపు అలాంటి కథతోనే వస్తే బాలయ్య సినిమా పై ప్రేక్షకులకు ఆసక్తి తగ్గుతుందని ఆదిత్య 999 కథ టైం మిషన్‌కి సంబందించింది కాకపోతే ఎటువంటి సమస్యా ఉండదు. బాలయ్య 100వ సినిమా ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే 100 వ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదలవుతుందని సమాచారం. బాలయ్య కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయేలా ఈ కాలం ప్రేక్షకుల ఇష్టాలకి తగ్గట్టుగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. విఎఫ్‌ ఎక్స్‌ గ్రాఫిక్స్‌కు ఎక్కువ సమయం పట్టడం వల్ల ఈ సినిమా రిలీజవడానికి ఎక్కువ సమయం పడుతుందని సినిమా యూనిట్‌ భావిస్తున్నారు.

English summary

A new twist on balakrishna's 100th film .Bala Krishna 100 Aditya 999 which sequel to aditya 369 movie story was based on Time Machine and now hero surya's "24 movie story was also "based on time machine.Surya's movie was releasing before balayya movie and if the stories of both the movies were same that will show impact on Balayya's 100th movie