'కాల్ మనీ సెక్స్ రాకెట్'లో కొత్త కోణం ....

New Twist In Call Money Case

01:39 PM ON 28th December, 2015 By Mirchi Vilas

New Twist In Call Money Case

సంచలనం సృష్టించిన కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్వవహారంలో బడా కంపెనీ పెద్దలకూ లింకు ఉందా ? ఇప్పటికే బెజవాడ కాల్ మనీ తో రాజకీయ నేతల పాత్ర ఉందన్న కోణంలో దర్యాప్తు సాగుతుంటే , తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సోనీ చీఫ్ మేనేజర్ మహేష్ పాత్ర కూడా ఉందన్న మాట వినిపిస్తోంది. బెజవాడలో కాల్ మనీ వ్యవహారంలో ఓ మహిళను ఏడుగురు సామూహిక అత్యాచారం చేసారన్న అభియోగం కింద నమోదైన కేసులో ముగ్గురు పట్టుబడగా , కీలక మైన నలుగురు నిందితులు పరారీలో వున్నారు.

పరారీలో వున్న వెనిగళ్ళ శ్రీకాంత్ , చెన్నుపాటి శ్రీను తదితరులు హైదరాబాద్ లో సోనీ తెలుగు రాష్ట్రాల చీఫ్ మహేష్ ని కలసినట్లు పోలీసులు గుర్తించారట. మహేష్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో పరారీలో వున్న నిందితులు నేరుగా కోర్టులో లోన్గిపోతారన్న విషయం బయట పడిందని తెలుస్తోంది. అందుకే కోర్టు దగ్గర మఫ్టీ పోలీసులను కాపలా ఉంచారు. నిందితులు అసలు సోనీ మహేష్ ని కలవడం వెనుక కారణా లేమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోపక్క నిందితులపై అదనపు సెక్షన్లు కూడా నమోదు చేసారు. అత్యాచారానికి గురైన మహిళ కోర్టులో చెప్పిన వాంగ్మూలం ప్రకారం 376, 354సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసారు. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి 7గురు తనపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు కోర్టు లో చెప్పడంతో నిందితులపై అదనపు కేసులు పెట్టారు.

కాగా బెజవాడలో కాల్ మనీ కి సంబంధించి ఇప్పటివరకు 780 కేసులు వచ్చాయని అంటున్నారు. 51 మంది పరారీలో వున్నారు. దాదాపు 150 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి సాగిస్తున్న కాల్ మనీ మాటున సెక్స్ రాకెట్ సాగుతోంది. ఇంత పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టడం వెనుక రాజకీయ నేతలు వున్నారని ఇప్పటికే తెల్సింది. బడా కంపెనీలకు కూడా లింకు ఉందా అనేది సోనీ మహేష్ చెప్పిన దాన్ని బట్టి తెలియాలి.

English summary