మల్లాది కేసు లో ట్విస్టు

New Twist In Malladi Vishnu Case

09:47 AM ON 25th January, 2016 By Mirchi Vilas

New Twist In Malladi Vishnu Case

నకిలీ మద్యం కేసులో ఎ 9 ముద్దాయిగా వున్న కాంగ్రెస్ నేత , మాజీ ఎంఎల్ఎ మల్లాది విష్ణు కి అక్రమాస్తులు ఉన్నాయన్న ఆరోపణపై ఈ కేసును ఈ డి కి రిఫర్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. విజయవాడ కృష్ణ లంక స్వర్ణ బార్ లో కల్తీ మద్యం సేవించి 5గురు మృత్యువాత పడగా , పలువురు అస్వస్తతకు గురయిన సంగతి తెల్సిందే. ఈ కేసు ని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అప్పగించడం, విష్ణుని 9వ ముద్దాయిగా చేర్చి , విచారించిన అనంతరం అరెస్టు చేసారు. ఈ కేసులో అరెస్టయిన విష్ణు కి , ఆయన సోదరుడు శ్రీనివాస్ కి బెయిల్ మంజూరు అవ్వడంతో విడుదలయ్యారు. అయితే విష్ణుకి 600 కోట్ల రూపాయల అక్రమాస్తులున్నట్లు సిట్ విచారణలో తేలిందట. దీంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) కి కేసుని రిఫర్ చేసినట్లు చెబుతున్నారు. అయితే కావాలనే వేధింపులకు గురిచేస్తున్నారని విష్ణు ఆరోపిస్తున్నారు. అక్రమాస్తులు లేవని అంటున్నారు. విష్ణుని మానసికంగా విధించడానికే ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసు ఎటు తిరిగి ఎటు వస్తుందో చూడాలి.

English summary

The main accused person in Swarana Bar Adulterated alcohol case was Congress EX- MLA Malladi Vishnu. Previously he was arrested by Vijayawada police and police officials filed another case on him for having 600 crore illegal asset