కత్తిలాంటోడు కి మళ్ళీ ఏమైంది?

New Twist On Chiru 150th Movie

11:21 AM ON 15th June, 2016 By Mirchi Vilas

New Twist On Chiru 150th Movie

చిరంజీవి 150వ మూవీ గురించి మరో కొత్త విషయం రివీల్ అయ్యింది. ఇందులో చిరు టూ షేడ్స్ లో కనిపిస్తారంటూ ఇప్పటివరకు వార్తలొచ్చాయి. కూతురు మ్యారేజ్ కి గెడ్డం తీయకుండా తమ అభిమాన నటుడు కనిపించడంతో ఇది కచ్చితంగా 150వ మూవీ లుక్కేనని భావించారు. ఐతే, మా అవార్డ్స్ ఫంక్షన్ లో చిరు స్లిమ్ గా కనిపించడంతో కత్తిలాంటోడు కి మళ్లీ ఏమైంది? ఏమైనా సమస్య వచ్చిందా? గెడ్డం ఎందుకు తీసినట్టు? అందుకు సంబంధించి పార్ట్ షూటింగ్ ఫినిష్ అయ్యిందా? అంటూ చర్చించుకుంటున్నారు.

చిరు మూవీ తొలుత ఈనెల 6న సెట్స్ కి వెళ్తుందని అన్నారు. ఆ తర్వాత 15కి వెళ్లింది.. ఇప్పుడేమో ఈనెల చివరలో షూట్ మొదలుకావచ్చని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో? మరోవైపు సోషల్ మెసేజ్ తోపాటు కామెడీ, రొమాన్స్ మాస్ టచ్ ఉండేలా ఈ ఫిల్మ్ రెడీ అవుతోందంటూ లీకులు బయటకు వస్తున్నాయి. ఒక మూవీలో ఇన్ని అంశాలు ఎలా సెట్ అవుతాయి? అన్నింటిని కలిపి కమర్షియల్ గా హిట్ కొట్టడం అంతసులువైన పని కాదంటూ ఫంక్షన్ కు వచ్చిన అతిధులు అంటున్నమాట. ఈ లెక్కన కత్తిలాంటోడు స్ర్కిప్ట్ పక్కకు వెళ్లినట్టేనని, ఇది ఇంకో స్టోరీ కావచ్చని అంటున్నవాళ్లూ వున్నారు. ఇలా ఎవరికివారే హార్డ్ ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్న నేపథ్యంలో చిరు ల్యాండ్ మార్క్ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందో? ఈ రూమర్లుకి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో? వేచి చూడాలి. మొత్తం మీద ఫ్యాన్స్ మాత్రం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:నెక్స్ట్ మూవీ కోసం బరువు పెరుగుతున్న పవర్ స్టార్

ఇవి కూడా చదవండి:సమంత లవ్ మ్యారేజ్ కి లైన్ క్లియర్!

English summary

We all know that Megastar Chiranjeevi was going remake Tamil Kathi movie as his 150th film and he recently looked very slim in Maa Awards and but the shooting of the movie was not yet started.