కొత్త టైపింగ్ యాప్ వచ్చేసింది..

New Typing App

07:04 PM ON 18th December, 2015 By Mirchi Vilas

New Typing App

ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోనే ఉంటోంది. గ్రామాలు, పట్టణాలు, నగరాలు అనే తేడాలు.. చిన్నా.. పెద్దా అనే బేధం లేదు. అయితే స్మార్ట్‌ఫోన్‌ యూజర్లలో చాలామంది తమ డివైస్‌లో మాతృభాషను వాడేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషల వాడకం ఈ మధ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు అనేక టైపింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఫన్నీట్యాప్ టెక్ కంపెనీ హైట్యాప్ ఇండిక్ కీబోర్డ్ పేరిట కొత్త యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్షన్ కలిగిన వారు దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఇంగ్లిష్‌తోపాటు హిందీ, తెలుగు, మరాఠీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, తమిళ్ వంటి భాషల్లోనూ టైపింగ్ చేసుకోవచ్చు. ఇలా టైప్ చేసుకున్న వాక్యాలను కాపీ చేసి ఇతర అప్లికేషన్లలో పేస్ట్ చేయవచ్చు. ఇంతేకాదు మరెన్నో ఫీచర్లను ఈ యాప్ అందిస్తోంది.

English summary

A new keyboard app was alaunched by funny tap app named Hi=tap typing app in which with the use of the app we can type in English , Telugu ,Tamil and some regional languages