'లింక్డ్ ఇన్' కాస్త కొత్తగా..

New Update Of Linked In

04:34 PM ON 7th December, 2015 By Mirchi Vilas

New Update Of Linked In

సోషల్ మీడియా సంస్థలు యూజర్లను ఆకర్షించేందుకు మరిన్ని ఫీచర్లతో కూడిన తాజా అప్‌డేట్లను యాప్‌లకు అందిస్తున్నాయి. ఇటీవల వాట్సప్, టెలిగ్రాంలు నూతన అప్‌డేట్‌లను అందించగా, తాజాగా ఇదే కోవలో 'లింక్డ్ ఇన్' కూడా తన ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లకు అప్‌డేట్లను విడుదల చేసింది. మరి ఇందులో కొత్తగా లభ్యమవుతున్న ఫీచర్లేమిటో ఇప్పుడు చూద్దాం.

లింక్డ్ ఇన్ కొత్త అప్‌డేట్‌లో 'ఫీడ్', 'మీ', 'మై నెట్‌వర్క్', 'మెసేజింగ్', 'సెర్చ్' వంటి నూతన ఆప్షన్లను అందిస్తోంది. 'ఫీడ్' ద్వారా యూజర్ తన అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతన వార్తల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. 'మీ' ద్వారా ప్రొఫైల్ సెట్టింగ్స్‌ను చూడడం, కామెంట్స్, పోస్ట్‌లను షేర్ చేయడం, ఇతరులు చేసిన వాటిని చూడడం చేయవచ్చు.

'మై నెట్‌వర్క్' ద్వారా యూజర్ తన సహచరులు ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చు. 'మెసేజింగ్' సెక్షన్ ద్వారా ఇతరులకు మెసేజ్‌లను పంపుకునేందుకు వీలుంది. చివరిగా 'సెర్చ్' ఆప్షన్ ద్వారా గ్రూప్‌లు, జాబ్స్, పల్స్ వంటి విషయాలను సెర్చ్ చేసుకోవచ్చు.

English summary

Social Messaging App Linked In Has bought new updates to its users,in this new there were features like feed,me,my network,messaging,search features in this new update of the app