టైపాయిడ్ , చికున్ గున్యాలకు కొత్త వ్యాక్సిన్లు

New Vaccine For Chikungunya And Typhoid

11:44 AM ON 22nd December, 2016 By Mirchi Vilas

New Vaccine For Chikungunya And Typhoid

ప్రాణాంతక బ్యాక్టీరియా సాల్మొనెల్లా వల్ల కలిగే వ్యాధుల నుంచి రక్షణకోసం శాస్త్రవేత్తల బృందం ఓరల్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. టైపాయిడ్ తరహా వ్యాధుల బారిన పడడానికి కారణం ఈ బ్యాక్టీరియానేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా ఈ బ్యాక్టీరియా కడుపులోకి ప్రవేశించి అనారోగ్యాల బారిన పడేలా చేస్తుందని, దీని నివారణ కోసం అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ను ఎలుకలపై ప్రయోగించి సంతృప్తికర ఫలితాలను సాధించామని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, చికున్ గున్యా బారిన పడకుండా రక్షించే తొలి వ్యాక్సిన్ ను ఇదే వర్సిటీకి చెందిన మరో శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. దీంతో చికున్ గున్యా నుంచి పూర్తిస్థాయిలో రక్షణ లభిస్తుందన్నారు. వ్యాక్సిన్ వేసిన వెంటనే రోగనిరోధక వ్యవస్థలో మార్పులు చోటుచేసుకుంటాయని, చికున్ గున్యాను నిరోధించేందుకు అవసరమైన శక్తిని పుంజుకుంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇవి కూడా చదవండి: తాగుబోతుల అలవాటు పోగొట్టేందుకు అద్భుత ఐడియా

ఇవి కూడా చదవండి: పిల్లలకు జలుబు తగ్గాలన్నా, కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలన్నా ఇవి తింటే మంచిది..

English summary

Scientists have been invented a new vaccine for most dangerous Chicken Gunya and Typhoid and scientists have been tested this vaccine on rats and they have got good results.