ఇక పై వాట్సాప్ కు ఫోన్ అవసరం ఉండదు

New Version Of Whats App For Personal Computers

04:26 PM ON 9th May, 2016 By Mirchi Vilas

New Version Of Whats App For Personal Computers

ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ లలో రారాజు ఎవరంటే ఎవరైనా వెంటనే చెప్పే పేరు వాట్సాప్. ప్రపంచంలో మొత్తం 100 కోట్లకు పైగా ప్రజలు వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారంటే ఈ చాట్ అప్లికేషన్ ఉన్న ఆదరణ ఎంతటిదో అర్ధం చేసుకోవచ్చు. కేవలం స్మార్ట్ ఫోన్ల లోనే కాకుండా పర్సనల్ కంప్యూటర్లలో సైతం ఈ అప్లికేషన్ ను వాడుకునే అవకాశం ఉన్నా కానీ స్మార్ట్ ఫోన్ లో ఉన్న అన్ని ఫీచర్ల ను కంప్యూటర్లో ఉపయోగించుకునే అవకాశం లేకపోవడంతో ఎక్కువ మంది వాట్సాప్ ను స్మార్ట్ ఫోన్ల లోనే ఉపయోగిస్తున్నారు . అతి త్వరలోనే వాట్సాప్ సంస్థ ఫీచర్లన్నిటినీ పర్సనల్ కంప్యూటర్లలో ఉపయోగించుకునే సౌలభ్యాన్ని తీసుకురాబోతున్నారు.

ఇవి కూడా చదవండి:తన తల్లి గురించి సీక్రెట్స్ బయటపెట్టిన చైతూ..

ఈ కొత్త అప్ డేట్ తో విండోస్ , మ్యాక్ అపరేటింగ్ సిస్టం లలో వాట్సాప్ లోని అన్ని కొత్త ఫీచర్లను ఉపయోగించుకోవచ్చట . ఈ విషయాన్ని ఇటీవల ఒక సంస్థ బయట పెట్టింది . ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే పీసి లో బ్రౌజర్ ద్వారా వాట్సాప్ ను వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ చాలా ఇబ్బంది గానే ఉంటుందని తెలుస్తోంది . వాట్సాప్ వెబ్ క్లయింట్ ఉపయోగించాలంటే మన స్మార్ట్ ఫోన్ లో తప్పకుండా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉండాలి , అంతేకాక వెబ్ బ్రౌజర్ కూడా ఎల్లప్పుడూ ఓపెన్ అయ్యి ఉండాలి.

ఇవి కూడా చదవండి:చిరంజీవికి నచ్చని ‘గ్యాంగ్‌లీడర్‌’- వాస్తవాలు ఇవిగో

ఇవి కూడా చదవండి:అమ్మ తో సెల్ఫీ దిగిన సెలబ్రిటీస్

English summary

Whats App to Bring New Update for its Users . A Latest Update that allows the user to use whats app in Personal Computer with all latest Features as well.