న్యూ యియర్ లో శ్రీవారి దర్శనానికి పక్కా ఏర్పాట్లు 

New Year Arrangements In Tirupati Temnples

03:34 PM ON 31st December, 2015 By Mirchi Vilas

New Year  Arrangements In Tirupati Temnples

కొత్త సంవత్సర శుభవేళ తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చే భక్తులు లెక్కకు మించి వుంటారు. ప్రముఖులు , వివి ఐ పిలు , వి ఐ పిలు కూడా ఎక్కువే వుంటారు. ముందు రోజు రాత్రికే తిరుమల కొండకు చేరుకొని , శ్రీవారి దర్శనం కోసం సిద్ధంగా వుంటారు. తిరుమలేశుని దర్శన భాగ్యం కొత్త సంవత్సర శుభవేళ ఇబ్బంది కలిగించకుండా వుండాలని టిటిడి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది.

నూతన సంవత్సరం రోజున తిరుమలకు వచ్చే భక్తులందరికీ దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేశామని తితిదే ఈవో సాంబశివరావు వివరిస్తూ , శుక్రవారం ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం 7గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతందన్నారు. వైకుంఠ ఏకాదశి కోసం ఏర్పాటు చేసిన వసతులన్నింటినీ భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రత్యేక దర్శనాలన్నింటిని రద్దు చేసి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేసారు.

English summary