స్పైస్‌ జెట్‌ న్యూ ఇయర్‌ ఆఫర్లు

New Year Offers From Spice Jet

07:14 PM ON 28th December, 2015 By Mirchi Vilas

New Year Offers From Spice Jet

ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌ జెట్‌.. కొత్త సంవత్సరం సందర్బంగా భారీ ఆఫర్లను ప్రకటించింది. హ్యాపీ న్యూ ఇయర్‌ సేల్‌ పేరుతో దేశీయ విమానప్రయాణానికి భారీ డిస్కౌంట్ అందిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఏప్రిల్‌ 12వ తేదీ లోపు ప్రయాణాలు చెయ్యాలనుకునే వారు ఈ డిస్కౌంట్‌ సేల్‌ కింద టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు. తమ దేశీయ విమాన సర్వీసుల్లో ఒకవైపు ప్రయాణ టిక్కెట్టు ప్రారంభ ధర రూ.716. దీనికి న్నులు అదనం. డిసెంబరు 31 నుంచి నాలుగు రోజుల పాటు ఈ ప్రత్యేక ఆఫర్లలో టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ల కింద టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారు కావాలనుకుంటే వాటిని రద్దు చేసుకునే సదుపాయం ఉందని రిఫండ్‌ వర్తిస్తుందని సంస్థ వెల్లడించింది.

English summary