బౌన్సర్‌ తగిలి కుప్పకూలాడు..

New Zeakand Cricketer McClenaghan Injured By A Bouncer

11:49 AM ON 26th January, 2016 By Mirchi Vilas

New Zeakand Cricketer McClenaghan Injured By A Bouncer

న్యూజీలాండ్ క్రికెటర్ మిచేల్‌ మెక్‌క్లాన్‌గన్‌ బౌన్సర్‌ ధాటికి మైదానంలోనే కుప్పకూలాడు. పాకిస్థాన్ బౌలర్ అన్వర్ అలీ మెరుపువేగంతో వేసిన బౌన్సర్‌.. మిచేల్‌ ధరించిన హెల్మెట్‌ను దాటుకొని మరీ అతని ఎడుమ కన్నును బలంగా ఢీకొనడంతో విలవిలలాడుతూ మైదానంలోనే పడిపోయాడు. వెల్లింగ్టన్‌లో సోమవారం న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య వన్డే మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. దీంతో మిచెల్ కన్ను చుట్టు రక్తస్రావం జరిగి నొప్పితో విలవిలల్లాడుతున్న అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతనికి కొన్ని కుట్లు వేశారు. కంటి చుట్టు ఉన్న ఎముకలు కొన్ని విరిగాయని, అయితే, తాను బాగున్నానని మిచేల్ ఆ తర్వాత ట్విట్టర్‌లో తెలిపాడు. కన్ను చుట్టు ఉన్నఎముక స్వల్పంగా విరుగడం వల్ల మిచేల్‌కు చిన్న శస్త్రచికిత్స చేయాల్సిన అవసరముందని వైద్యులు తెలిపారు.

తొలి వన్డేలో పాక్‌పై కివీస్‌ గెలుపు

కాగా, వెల్లింగ్టన్‌లో పాక్‌తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌ 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 46 ఓవర్లలో 210 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

English summary

New Zealand Cricketer McClenaghan Injured By A Bouncer which was bowled by Pakistan bowler during the match between New Zealand and Pakistan.