టీ20లో లంకపై కివీస్ థ్రిల్లింగ్ విక్టరీ

New Zealand register thrilling win Against Sri Lanka

06:14 PM ON 7th January, 2016 By Mirchi Vilas

New Zealand register thrilling win Against Sri Lanka

గురువారం హోరాహోరీగా జరిగిన టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ శ్రీలంకపై ఘన విజయం సాధించింది. రెండు టీ20 మ్యాచ్ లలో భాగంగా తొలిమ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్ ఓపెనర్లు గుప్తిల్(58పరుగులు, 34 బంతులు, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), విలియమ్సన్(53పరుగులు, 42 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్స్) లు ముందు నుంచే స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఒక దశలో 200 స్కోరును కూడా సులువుగా దాటేలా కనిపించింది. కానీ 101 పరుగులు భాగస్వామ్యం తర్వాత తొలి వికెట్ కోల్పోవడంతో రన్ రేట్ తగ్గింది. చివర్లో పుంజుకున్న కివీస్ నిర్ణీత 20 ఓవర్లో 182 పరుగులను చేసి 4 వికెట్లను కోల్పోయింది. 183 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన లంకను న్యూజిలాండ్ బౌలర్లు ముందు నుంచే వికెట్లను తీస్తూ కట్టడిచేశారు. దీంతో రన్ రేట్ బాగానే ఉన్నా మరో వైపు వికెట్లు కోల్పోతూ వచ్చింది. గునతిలకా(46పరుగులు, 29 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సిరివర్ధనా(42పరుగులు, 31 బంతులు, 2 ఫోర్లు, 2సిక్సర్లు) శ్రీలంక స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నంలోనే ఔటయ్యారు. చివరి ఓవర్లో శ్రీలంక 13 పరుగులు చేయాల్సి ఉండగా 9 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 3 పరుగు తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. న్యూజిలాండ్ బౌలర్ బౌల్ట్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

English summary

New Zealand registers a thrilling victory against Srilanka in T20