కివీస్‌-లంక నాలుగో వన్డే వర్షార్పణం

New Zealand-Sri Lanka fourth ODI Cancelled

06:46 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

New Zealand-Sri Lanka fourth ODI Cancelled

న్యూజిలాండ్‌-శ్రీలంకల మధ్య నెల్సన్‌ వేదికగా జరగాల్సిన నాలుగో వన్డే వర్షార్పణమైంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు స్టేడియంలో భారీ వర్షం కురిసింది. వాతావరణం అనుకూలించక పోవడంతో ఉదయం దాదాపు 5 గంటలు ఆలస్యంగా మ్యాచ్‌ ప్రారంభమైంది. 50 ఓవర్ల మ్యాచ్‌ను 24 ఓవర్లకు కుదించారు. అనంతరం టాస్‌ గెలిచిన శ్రీలంక జట్టు న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మ్యాచ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే మళ్లీ వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. 9 ఓవర్లు ఆడిన న్యూజిలాండ్‌ 3 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. క్రీజులో ఉన్నది కొద్దిసేపు అయినప్పటికీ కివీస్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ మళ్లీ వీర విహారం సృష్టించాడు. ఎదుర్కొన్న 14 బంతుల్లో 3 సిక్స్‌లు, 1 ఫోరు సాయంతో 27 పరుగులు చేశాడు. ఆట రద్దయ్యే సమయానికి రాస్‌ టేలర్‌ 20, హెన్రీ నికోలస్‌ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. శ్రీలంక బౌలర్లు చమీర, పెరీరా, కులశేఖర తలో వికెట్‌ తీశారు. చివరిదైన ఐదో వన్డే మ్యాచ్‌ మంగళవారం జరగనుంది.

English summary

The fourth one-day international between New Zealand and SriLanka was stopped after nine overs of the innings. Due to that rain the match has been cancelled.