కివీస్ దే వన్డే సిరీస్‌

New Zealand Wins ODI Series Against Sri Lanka

07:05 PM ON 5th January, 2016 By Mirchi Vilas

New Zealand Wins ODI Series Against Sri Lanka

న్యూజిలాండ్‌ పర్యటనలో శ్రీలంక టెస్టు సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌ ను కూడా కోల్పోయింది. మంగళారం జరిగిన ఐదో వన్డే మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో లంక ఓటమి పాలైంది. తొలుత టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న లంక జట్టు.. న్యూజిలాండ్‌ బ్యాట్స్ మెన్లను కట్టడి చేయడంలో విజయవంతమైనప్పటికీ.. గప్తిల్‌ (102) సెంచరీతో నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయిన కివీస్‌ 294 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన లంక టీమ్‌.. ఆది నుండే తడబడింది. ఓపెనర్లు గుణతిలక (15), దిల్షాన్‌ (5) విఫలమవడంతో జట్టు కష్టాల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో చండీమల్‌ (50), మాథ్యూస్‌ (95) గట్టి ప్రయత్నమే చేసినా విజయాన్ని అందుకోలేకపోయారు. బౌల్ట్ 3, హెన్రీ 5, మిల్నె 1, సంత్నర్‌ 1 వికెట్‌ తీసి లంక పతనాన్ని శాసించారు. 47.1 ఓవర్లలో లంకను 258 పరుగులకు ఆలౌట్‌ చేశారు. హెన్రీకి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది. దీంతో 5 వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను కివీస్‌ 3-1తో కైవసం చేసుకుంది. ఈ రెండు జట్ల మధ్య జనవరి 7న తొలి టి20, జనవరి 10న రెండో టి20 జరగనుంది.

English summary

New Zealand wins ODI series against Srilanka. NewZealand defeated Srilanka in 5th oneday international