శ్రీ‌లంక‌పై న్యూజిలాండ్ విక్టరీ

New Zealand Wins Over Srilanka

07:22 PM ON 28th December, 2015 By Mirchi Vilas

New Zealand Wins Over Srilanka

ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 30 బంతుల్లో 8 సిక్స‌ర్లు, 9 ఫోర్ల‌తో 93 ప‌రుగులు చేయ‌డంతో శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ భారీ విజయం సాధించింది. న్యూజిల్యాండ్ లోని క్రైస్ట్ చ‌ర్చ్ లో జ‌రిగిన ఈ వ‌న్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 24.7 ఓవ‌ర్ల‌కు 117 ప‌రుగులు చేసి అలౌట్ అయింది.. కుల‌శేఖ‌ర ఒక్క‌డు మాత్రం 19 ప‌రుగులు చేశాడు.. మిగిలిన వాళ్లంతా అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోయారు. 118 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ్యాటింగ్ దిగిన న్యూజిల్యాండ్ కేవ‌లం 8.2 ఓవ‌ర్ల‌లోనే 118 ప‌రుగులు చేసి సునాయాసంగా విజ‌యం సాధించింది. గప్టిల్ లంక బౌలర్లను ఎడాపెడా బాదుతూ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 30 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 93 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 17 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధసెంచరీ పూర్తిచేశాడు. వన్డేల్లో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టిన న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ గా రికార్టు క్రియేట్ చేశాడు.

English summary