పాక్‌పై వన్డే సిరీస్ గెలిచిన కివీస్‌

New Zealand Won OneDay Series Against Pakistan

04:55 PM ON 1st February, 2016 By Mirchi Vilas

New Zealand Won OneDay Series Against Pakistan

పాకిస్థాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు 2-0తో గెలుచుకుంది. ఆక్లాండ్ లో జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్‌ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 47.3 ఓవర్లలో 290 పరుగులకు ఆలౌటైంది. మహమ్మద్‌ హఫీజ్‌(76), బాబర్‌ అజీమ్‌(83) సర్ఫరాజ్‌ అహ్మద్‌(41), షోయబ్‌ మాలిక్‌(32) రాణించడంతో పాక్‌ భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో ఆడబ్‌ మిలైన్‌ 3, ట్రెన్ట్‌బౌల్డ్‌ 2, హెన్రీ 2, అండర్స్‌న్‌, సాంటినర్‌ తలో వికెట్‌ తీశారు. పాక్‌ ఇన్నింగ్స్‌ తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో న్యూజిలాండ్‌ విజయలక్ష్యాన్ని 43 ఓవర్లలో 263 పరుగులకు కుదించారు. లక్ష్య ఛేదనలో కివీస్‌ 6 పరుగుల వద్దే స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ మెక్‌కల్లమ్‌(0) వికెట్‌ కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన విలియమ్‌సన్‌(84)తో కలిసి మరో ఓపెనర్‌ గుప్తిల్‌(82) పాక్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని జట్టు విజయానికి పునాది వేశాడు. వీళ్లిద్దరూ రెండో వికెట్‌కు 159 పరుగుల జోడించారు. అనంతరం వీరు వెనువెంటనే ఔటయినప్పటికీ చివర్లోఅండర్సన్‌(35), రోంచి(20) రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. 42.4 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్‌ లక్ష్యాన్ని చేధించింది. న్యూజిలాండ్‌ ఓపెనర్‌ గుప్తిల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

English summary

New Zealand team won the One day series against pakistan by beating pakistan in the third ODI and won the series by series 2-0