న్యూజిలాండ్ దే టీ20 సిరీస్‌

New Zealand Won T20 Series Against Pakistan

10:08 AM ON 23rd January, 2016 By Mirchi Vilas

New Zealand Won T20 Series Against Pakistan

పాకిస్థాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను ఆతిథ్య న్యూజిలాండ్‌ కైవసం చేసుకుంది. పటిష్ఠమైన బౌలింగ్‌ లైనప్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో కివీస్‌ ఆటగాళ్లు తమ జట్టుకు 95 పరుగులు తేడాతో భారీ విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో న్యూజిలాండ్‌ 2-1తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకొంది. శుక్రవారం న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ కోరె అండర్సన్‌ పాక్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 42 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఓపెనర్‌ గప్తిల్‌ 19 బంతుల్లో 42, విలియంసన్‌ 33 పరుగులు చేసి జట్టుకు 196/5 భారీ స్కోరును అందించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ ఓపెనర్లు 10 పరుగుల లోపే పెవిలియన్‌ చేరారు. జట్టులో 9 మంది బ్యాట్స్‌మెన్లు రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోయారు. సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌ 41 (36 బంతుల్లో), షోయబ్‌మాలిక్‌ 14 పరుగులు చేశారు. మొత్తానికి ఆ జట్టు 16.1 ఓవర్లలో 101 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్‌ టీ20 చరిత్రలో 95 పరుగుల భారీ తేడాతో అపూర్వ విజయం సాధించింది. కివీస్‌ బౌలర్లలో ఏఎఫ్‌ మిల్నే 3, ఇల్లియట్‌ 3, అండర్సన్‌ 2, బౌల్ట్‌ 1 వికెట్‌ పడగొట్టారు. అండర్సన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.

English summary

New Zealand won T20 series against Pakistan.New Zealand won in third T20 by 95 runs margin.Corey anderson scores 82 runs in just 42 balls and he is selected as man of the match