న్యూజిలాండ్ లో ఆసీస్‌ కు షాక్..

New Zeland Won Against Australia In First ODI

07:38 PM ON 3rd February, 2016 By Mirchi Vilas

New Zeland Won Against Australia In First ODI

టీ20ల్లో టీమిండియా ఇచ్చిన షాక్ నుంచి ఆస్ట్రేలియా జట్టు ఇంకా తేరుకోలేనట్టుంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే ఆసీస్‌ చేతులెత్తేసింది. ఆక్లాండ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు కివీస్ 159 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 307 పరుగుల భారీస్కోరు సాధించింది. ఓపెనర్లు గుప్తిల్‌(90), మెక్‌కల్లమ్‌(44)జట్టుకు శుభారంభం ఇచ్చారు. నికోల్స్‌(61), ఎలియట్‌(21), సాన్‌టీర్‌(35) రాణించడంతో న్యూజిలాండ్‌ భారీ స్కోరు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్‌వుడ్‌ 2, ఫాల్కనర్‌ 2, మార్ష్‌ 2 హేస్టింగ్‌ ఒక వికెట్‌ తీశారు. 308 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 24.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటై ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఓ దశలో 41 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌.. వేడ్‌(37), ఫాల్కనర్‌(36) రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా చేసింది. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌ 3, హెన్రీ 3 వికెట్లు తీసి ఆసీస్‌ పతనాన్ని శాసించారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 146 బంతులకే(24.2ఓవర్లు) ఆలౌటైంది. ఇది ఆ జట్టు వన్డే చరిత్రలోనే అత్యల్పం. 1977లో 152 బంతుల్లో ఆలౌటవ్వడమే ఆసీస్‌కు ఇప్పటివరకు రికార్డు. న్యూజిలాండ్‌ ఓపెనర్‌ గుప్తిల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌ 1-0తేడాతో ఆధిక్యంలో నిలిచింది. కాగా, న్యూజిలాండ్‌ స్టార్ బ్యాట్స్‌మెన్‌ మెక్‌కల్లమ్‌ 6,000 పరుగుల మైలురాయిని అందుకుని.. ఫ్లెమింగ్‌, ఆస్టల్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో కివీస్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

English summary

After White Wash by India in T20 series Australia team busy with New Zealand series. In first ODI between Australia and New Zealand , Australia Allout for 148 Runs while chasing 308 runs Target