పెళ్లిఫంక్షన్ లో నూతన దంపతులు ఎం చేశారో తెలుసా?(వీడియో)

Newly Married Couple Surprised Guest With Their Dance

11:45 AM ON 17th December, 2016 By Mirchi Vilas

Newly Married Couple Surprised Guest With Their Dance

సాధారణంగా కొత్త దంపతులు అందరిముందు సిగ్గు పడుతూ తుళ్లిపడుతూ వుంటారు. కానీ ఈ జంట ఓ పని చేసి అదరగొట్టేసారు. అదేమిటి ఎక్కడ అనుకుంటున్నారా. అయితే ఇది జరిగింది ఇండియాలో కాదు. స్టాఫోర్డ్ లో ఈ సంఘటన జరిగింది. డ్యాన్స్ టీచర్ అయిన పెళ్లికూతురు కేతీ హమండ్, నైజీరియాకు చెందిన పెళ్లికొడుకు జెఫ్ ల మ్యారేజీ స్టాఫోర్డ్ లో అక్టోబర్ మాసంలో జరిగింది.

తరువాత రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీంతో పాటే ఆ రిసెప్షన్ కు వచ్చిన అతిధులకు బ్రహ్మాండమైన గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏంటంటే, ఆనందం పట్టలేని ఆ జంట పెళ్లికొచ్చిన అతిధుల ఎదుట డ్యాన్స్ చేసి కనువిందుచేశారు. బ్రిటిష్ డ్యాన్సర్ అయిన కేతీ, నైజిరియన్ జెఫ్ లు చేసిన డ్యాన్స్ సూపర్ అంటూ గెస్టులు కితాబిచ్చిన ఈడ్యాన్స్ వీడియో వైరల్ అయింది..

ఫంక్షన్ కొచ్చిన క్లోజ్ ఫ్రెండ్స్.. అతిధులు ఈ సర్ప్రైజ్ డ్యాన్స్ చూసి తెగ ముచ్చటపడిపోయారు. ఫంక్షన్ కు ముందు కొద్దిసేపు మాత్రం ఫ్రంట్ రూంలో సినిమా డ్యాన్సులు చూసి రిహార్సెల్స్ చేశారట. ఇక ఈ కొత్త జంట నైజిరియన్ ఆర్టిస్ట్ యమీ అలేడ్ ట్యూన్స్ కు అద్భుతంగా డ్యాన్స్ చేసి చేసి గెస్ట్ లను ఆనందాల్లో ముంచెత్తారు. ఈ వీడియోకి వీరలెవెల్లో కామెంట్స్ పడుతున్నాయి.

English summary

A Newly married couple was invited their friends and family members to the wedding reception and the new couple surprised the guests with their live dance performance. Now this video had gone all over the social media.