ఇలా పెళ్లయింది...గదిలోకి వెళ్లారు..అంతే అలా విడాకులు..కారణం?

Newly Married Saudi Bride Divorced For Chatting On Mobile Phone

10:58 AM ON 18th May, 2016 By Mirchi Vilas

Newly Married Saudi Bride Divorced For Chatting On Mobile Phone

ఈ నవీన కాలంలో భార్యాభర్తలు విడిపోవడానికి కారణాలు ఒకటి రెండు కాదు అనేకం ఉంటున్నాయి. ఇక పెరుగుతున్న టెక్నాలజీ సైతం పక్కదారుల్లో వినియోగించడం వలన పచ్చని కాపురాల్లో చిచ్చు రేగుతోంది. తాజాగా సౌదీ అరేబియాలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. సౌదీ అరేబియాకు చెందిన ఓ వధువు పెళ్లయిన కొద్దిసేపటికే భర్త నుంచి విడాకులు తీసుకుంది. అయితే దీనికి కారణమేంటో తెలిస్తే... ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యపోక మానరు. ఆ కొత్త జంట పెళ్లి వేడుక ముగిసింది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత ఇద్దరూ హోటల్‌కెళ్లారు. హోటల్‌ గదిలోకి వెళ్లగానే ఆమె మొబైల్ తీసి సందేశాలు పంపించడం... రిసీవ్ చేసుకోవడం మొదలైంది.

ఇవి కూడా చదవండి:అల్లు అరవింద్ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎటాక్

పెళ్లి కొడుకు ఆమెతో మాట్లాడాలని చూసినా ఆమె పట్టించుకోలేదు. తనతో మాట్లాడలేనంతగా మొబైల్‌లో ఏం చేస్తున్నావని అతను అడిగాడు. పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ తన ఫ్రెండ్స్ సందేశాలు పంపిస్తున్నారని... వాటికి బదులిస్తున్నానని ఆమె చెప్పింది. అయితే తర్వాత చాట్ చేయొచ్చు...తనతో మాట్లాడమని భర్త కోరినా ఆమె వినిపించుకోలేదు. దీంతో అతనికి చిర్రెత్తుకొచ్చింది. ఆమెపై కోపంతో నా కంటే ఫ్రెండ్సే ముఖ్యమా అని ప్రశ్నించాడు. ఆమె ఔనని సెలవిచ్చే సరికి మనోడికి దిమ్మతిరిగింది. చేసేదేమీ లేక విడాకులు కావాలని ఆమెను అడిగాడు. ఆమె కూడా సరే అనడంతో ఇద్దరూ విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. కారణం ఏమిటి ? మానవ సమాజం ఎటు పోతోంది.?

ఇవి కూడా చదవండి:లిప్ కిస్ తో కాజల్ ను షాక్ చేసిన హీరో

ఇవి కూడా చదవండి:ఛ ఛ.. నడి వీధిలో... అది కానిచ్చేసారు(వీడియో)

English summary

A Newly Married Couple were taken divorce for chatting on mobile phone. This weird incident was occurred in Saudi Arabia. The newly married bride was continues her chatting and they decided to take divorce.