ఇతడి విన్యాసం చూస్తే గుండె జలదిరిస్తుంది.. ఇంతకీ ఏం చేసాడో తెలుసా(వీడియో)

Newport Harbor 129 ft CRAZY Jump Into Water

05:24 PM ON 29th October, 2016 By Mirchi Vilas

Newport Harbor 129 ft CRAZY Jump Into Water

ఈ లోకంలో ప్రతిఒక్కరికి ఏదో యావ ఉండి తీరుతుంది. ముఖ్యంగా అందరి దృష్టిలో పడాలని, ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని చాలామందికి ఉంటుంది. ఇందుకోసం ఎలాంటి పనిచేయడానికైనా కొందరు వెనుకాడరు. పేరు రావడం కోసం ఎదుటివారిని ఇబ్బంది పెట్టడానికైనా సరే అంటారు. ఆ కోవకే చెందిన వ్యక్తే కాలిఫోర్నియాకు చెందిన ఆంటోని బూత్ ఆర్మర్. ఇతడు జనాలను ఆకర్షించడానికి చేసే విన్యాసం చాలా విచిత్రంగా ఉంటుంది. అది ఏంటనేగా మీ ఆలోచన.. ఎవరికైనా మేడ మీద నుంచి కిందకి చూడాలంటే చాలా భయంగా ఉండడం సహజం. కానీ ఇతనికి మాత్రం ఎత్తైన బిల్డింగ్ లను చూస్తే మాత్రం పూనకం వచ్చిన వాడిలాగా ఊగిపోతాడు. తలకి ఒక కెమేరా తగిలించుకుని బిల్డింగ్ ల మీద నుంచి దూకేస్తాడు.

నివాస యోగ్యమైన బిల్డింగ్ లనే కాకుండా, సముద్రం చుట్టుపక్కల ఉండే వాటిని, స్విమ్మింగ్ పూల్స్ ఇలా నీరు నిండుగా ఉండే ప్రదేశాలను వేటిని వదలడు. అలా దూకి, చిత్రించిన వాటిని యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడం, ఇదే ఇతని నిత్యకృత్యం. గడిచిన మూడు నెలల్లో ఇతని వీడియోలకి కోటి లైకులు రావడం విశేషం. యూట్యూబ్ లో ఈ వీడియోస్ ని చూసిన పోలీసులకు ఎవరు ఇలాంటివి చేస్తున్నారా అని ఆరా తీయగా, యూట్యూబ్ లో 8బూత్ అనే పేరు మీద వీడియోస్ వస్తున్నట్టుగా గుర్తించారు. ఆర్మర్ మాత్రం పోలీసులకు చిక్కకుండా ముప్పుతిప్పలు పెట్టేవాడు. అతన్ని పట్టుకున్న తరువాత అతని చేష్టల గురించి పోలీసులు వివరించారు.

దూకడమే పెద్ద తప్పనుకుంటే, అలా దూకడానికి ఓనర్ అనుమతి కూడా తీసుకునేవాడు కాదని, ఇతని పనులకు చాలా మంది భయబ్రాంతులకు గురయ్యారని పోలీసులు తెలిపారు. మీడియా ముందు తాను కేవలం సరదా కోసమే చేస్తున్నట్టు చెప్పడంతో అక్కడి వారు ముక్కున వేలేసుకున్నారు. వెర్రి వేయిరకాలంటే ఇదే అంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు.

English summary

Newport Harbor 129 ft CRAZY Jump Into Water