ఆ పత్రికకు పంచ్ పడినట్లే....

News Paper Cartoon On Jayalalitha

10:19 AM ON 20th May, 2016 By Mirchi Vilas

News Paper Cartoon On Jayalalitha

తొందర పడితే పప్పులో కాలేసినట్లే కదా...తమిళనాట ఓ పత్రిక అలానే చేసి, ఇప్పుడు ఇరకాటంలో పడేలా తయ్యారయింది. ఇంతకీ విషయం ఏమంటే , తమిళనాట భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆ పత్రికలో ఓ కార్టూన్ వేశారు. అందులో జయలలిత ఇంట్లో మెడవరకు నీళ్లలో మునిగి టీవీలో ఫలితాలు చూసుకుంటున్నట్లుగా ఉంది. ఈ కార్టూన్ ఉద్దేశమేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెడవరకు మునిగిన జయ.. ఇక ఫలితాలు చూసుకుని పూర్తిగా మునగడం మాత్రమే మిగిలి ఉందన్న సంకేతాల్నిచ్చింది ఆ కార్టూన్. ఈ కార్టూన్ వెనుక వేరే ఉద్దేశాలు లేకుంటే.. కరుణానిధి.. విజయ్ కాంత్ లతో పాటు అందరినీ ఒకే సీన్లోకి తీసుకొచ్చి ఉండొచ్చు. అలా కాకుండా జయలలితను మాత్రమే చూపించడాన్ని బట్టి ఆమె ఓటమి ఖాయమన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల ఆధారంగా కార్టూన్ వేసినట్లు స్పష్టమవుతోంది. కానీ ఈ రోజు రిజల్ట్ అమ్మకు అనుకూలంగా రావడంతో ఆ పత్రికకు గట్టి పంచ్ పడ్డట్లయింది. అందుకే తొందర పనికిరాదని అంటారు.

ఇవి కూడా చదవండి:మెగా స్టార్ పాత్ర పోషించిన విజయ్ కాంత్

ఇవి కూడా చదవండి:సెల్ఫీ దిగుతుంటే జారిన డ్రెస్

English summary

A Cartoon on news paper made some controversy. In that newspaper cartoon they printed that Jayalalitha was defeated and she was in water up to neck. That cartoon was printed because of exit polls said that she was going to defeat in the elections. But Jayalalitha was won for the second consecutive time in Tamilnadu.