ఉగ్రవాదం అరికట్టేందుకు యాప్‌ సిద్ధం చేసిన న్యూయార్క్‌

Newyork Releases Its New App To Prevent Terrorist Attacks

11:38 AM ON 24th November, 2015 By Mirchi Vilas

Newyork Releases Its New App To Prevent Terrorist Attacks

ప్రపంచం ఇప్పుడు ఉగ్రవాదం అన్న పదం వింటేనే కలవరపడుతుంది. అభివృద్ధి చెందిన దేశం, వెనుకబడిన దేశం అంటూ తేడా లేకుండా అన్ని దేశాలపై ఇప్పుడు ఉగ్రవాదం నీలినీడలు అలుముకున్నాయి. ఉగ్రవాదంపై పోరుకు అన్ని దేశాలు ఇప్పుడు కలిసి కట్టుగా సమరం సాగించాల్సి వస్తోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా పేరొందిన న్యూయార్క్‌ ఇప్పుడు ఉగ్రవాదం నీడలు ఆ నగరంపై పడకుండా ఉండేందుకు తమ పౌరులకు ఉపయోగపడేలా ఒక యాప్‌ను తీసుకువచ్చింది.

ఇక నుండి న్యూయార్క్‌ సిటిజన్స్‌ ఎవరైనా తమకు అందిన, అనుమానాస్పదంగా భావిస్తున్న సమాచారాలని న్యూయార్క్‌ రక్షణ విభాగానికి వెంటనే అందించేలా ఈ యాప్‌ సిద్ధమైంది. సమాచారాన్ని అత్యంత వేగం చేరవేసేందుకు, దుర్ఘటనలు సంభవించిన వెంటనే తక్షణమే స్పందించేందుకు అన్ని రకాల ఫీచర్‌లతో ఈ యాప్‌ను రూపొందించారు. మీరు ఏదైనా ఒక విషయాన్ని కానీ సంఘటన ను కానీ చూసిన వెంటనే, అది న్యూయార్క్‌ రక్షణకు చెందిన విషయం అని భావించిన వెంటనే ఆ ఫొటోలను, లేదా వీడియోలను వెంటనే సదరు రక్షణ విభాగంకు పంపే వీలుంటుంది. ఇలా వచ్చిన వేలాది ఫొటోలను, వీడియోలను అత్యంత వేగవంతంగా విశ్లేషించి తగిన చర్యలు తీసుకునేలా యంత్రాంగాన్ని సిద్ధంచేసారు.

ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న వెంటనే పౌరులు తమ వివరాలను ఫోన్‌నెంబర్లను పొందుపరచిన వెంటనే తమకు తెలిసిన సమాచారాన్ని యాప్‌ ద్వారా న్యూయార్క్‌ రక్షణ విభాగానికి పంపవచ్చు. న్యూయార్క్‌ ప్రభుత్వం ఇప్పటికే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకునేందుకు మరింత సిబ్బందిని నియమించుకుంది. పారిస్‌ అల్లర్ల తర్వాత ఉగ్రవాద మూకలు అత్యంత భద్రతగా ఉంటుందని భావించే మెట్రోపాలిటన్‌ నగరాలను కూడా వదలడం లేదని అర్థమైపోయింది. ఇలాంటి ఉగ్రవాది దాడి మళ్ళీ జరగదని కూడా ఎవరూ హామీ ఇవ్వలేరు. అందుకనే అత్యంత అభివృద్ధి చెందిన, భారీ జన సమూహం కలిగిన న్యూయార్క్‌ భద్రత మరింత సంక్లిష్టతరమవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాలు ఉగ్రవాదంపై పోరు జరిపేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని నమ్ముకుంటోంది.

English summary

Newyork releases its new mobile app which helps to prevent terroist attacks.This app allows user to give information about unknown suspected people to the police . This app main intention is to protect people from terrorist attacks.